Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెవి రంధ్రంలో దూరిన పైతాన్.. ఫేస్‌బుక్‌లో సెల్ఫీ.. షేర్లు, లైక్స్ వెల్లువ

చెవి రంధ్రంలో పైతాన్ అదే.. కొండచిలువ దూరింది. ఇదేంటి? కొండ చిలువ చెవిపోగులు ధరించే రంధ్రంలోకి ఎలా వెళ్ళిందని ఆశ్చర్యపోతున్నారు కదూ.. నిజమే.. పైతాన్ పిల్ల ఆ పని చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. అమెరికాలో

Advertiesment
Woman's python gets stuck in her ear gauge
, గురువారం, 2 ఫిబ్రవరి 2017 (15:27 IST)
చెవి రంధ్రంలో పైతాన్ అదే.. కొండచిలువ దూరింది. ఇదేంటి? కొండ చిలువ చెవిపోగులు ధరించే రంధ్రంలోకి ఎలా వెళ్ళిందని ఆశ్చర్యపోతున్నారు కదూ.. నిజమే.. పైతాన్ పిల్ల ఆ పని చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. అమెరికాలోని పోర్ట్‌లాండ్‌కి చెందన ఆష్లే గావ్ అనే యువతి బాల్ పైథాన్ రకానికి చెందిన కొండచిలువను పెంచుకుంటుంది. ఉన్నట్టుండి ఆ పాము.. చెవిపోగులు పెట్టుకునేందుకు ఆష్లే చేయించుకున్న పెద్ద రంధ్రంలోని దూరింది. 
 
ఇలా చెవిరంధ్రంలో దూరి సగం వరకు వెళ్లింది. కానీ సగానికి ఇరుక్కుపోయింది. దీంతో అమ్మడుకు చుక్కలు కనిపించాయ్. అంతే ఆస్పత్రికి లకించుకుంది. ఆస్పత్రి ఎమర్జెన్సీ రూమ్‌కి పరిగెత్తుకెళ్లి డాక్టర్లను ఆశ్రయించింది. పైథాన్‌ ప్రాణాలకు ప్రమాదం లేకుండా బయటికి తీయాలని కోరింది. 
 
ఇక భయంతోనే వైద్యులు ఆమె చెవులకు మత్తిచ్చి పాముకు లూబ్రికెంట్లు రాసి పామును వెలికి తీశారు. ఈలోగానే ఆష్లే ‘ప్రస్తుతం ఇది నా పరిస్థితి’ అంటూ చెవిలోదూరిన పాముతో సహా సెల్ఫీ తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేగాకుండా ఈ ఫోటోకు లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం కేసీఆర్ జీతం చూస్తే కళ్ళు తిరగాల్సిందే.. జయలలిత ఒక్కరూపాయి తీసుకునేవారు!