ఆపిల్ నుంచి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ ఎయిర్ మార్కెట్లోకి వచ్చాయి. సెప్టెంబర్ 9, మంగళవారం, ఆపిల్ ఏవ్ డ్రాపింగ్ ఈవెంట్‌లో ఈ ఫోన్లను పరిచయం చేసింది. వెనిల్లా ఐఫోన్ 17 కొంచెం ఖరీదుతో, బేస్ వేరియంట్ ప్రస్తుతం 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది ఐఫోన్ 16 అందించే దానికంటే రెట్టింపు అవుతుంది.
అలాగే ఐఫోన్ 17 సిరీస్‌లోని అన్ని మోడల్స్.. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ ఎయిర్ సెప్టెంబర్ 12 నుండి ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో సెప్టెంబర్ 19 నుండి స్టోర్‌లు, ఆన్‌లైన్ రిటైలర్ల నుండి కొనుగోలు చేయవచ్చు.
ఈసారి, ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లోని అన్ని మోడళ్ల ధరను కొద్దిగా పెంచింది. వెనిల్లా ఐఫోన్ 17 రూ. 82,900 నుండి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ వరుసగా రూ. 1,34,900, రూ. 1,49,900 నుండి ప్రారంభమవుతాయి. అయితే, అదే పరికరాలు యునైటెడ్ స్టేట్స్‌లో చాలా చౌకగా ఉంటాయి.
అయితే అమెరికా నుంచి ఐఫోన్ 17ను కొనుగోలు చేస్తే దానికి.. దానికి భౌతిక సిమ్ కార్డ్ స్లాట్ ఉండదని గుర్తుంచుకోవాలి. ఇందుకు, బదులుగా ఈ-సిమ్‌కి మాత్రమే మద్దతు ఇస్తాయి.
కొన్ని మార్కెట్లు క్యారియర్-లాక్ చేయబడిన ఐఫోన్‌లను విక్రయిస్తాయి. అంటే అవి భారతీయ సిమ్ కార్డులతో పని చేయకపోవచ్చు. భారతదేశంలో కంటే తక్కువ ధరకు ఐఫోన్ 17 సిరీస్‌ను కొనుగోలు చేయడానికి అమెరికా తర్వాత కెనడాలో ఈ ఫోన్ రూ. 72,500 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లు భారత్‌లో స్కైబ్లూ, లైట్ గోల్డ్, స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్ వంటి కలర్స్ ఆప్షన్స్ వుంటాయి.
ఐఫోన్ లైనప్‌ను Mac మరియు iPad లైనప్‌లతో పోల్చినట్లయితే, iPhone 17 Air MacBook Air లేదా iPad Airతో సమానంగా ఉంటుంది, అయితే iPhone 17 Pro అనేది MacBook Pro లేదా iPad Proకి సమానం. ఐఫోన్ 17 ప్రో మోడల్స్ హాఫ్-గ్లాస్ హాఫ్-అల్యూమినియం బాహ్య భాగాన్ని కలిగి ఉంటాయని, గాజు భాగం ఇప్పటికీ మాగ్‌సేఫ్ ఛార్జింగ్‌కు అనుమతిస్తుంది.