Publish Date: Sun, 19 Jul 2026 (16:39 IST)
Updated Date: Sun, 19 Jul 2026 (16:42 IST)
ఫేస్‌బుక్ - ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫీడ్ లోడ్ అవ్వకపోవడం, సందేశాలు వెళ్లకపోవడం, లాగిన్ విషయంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫొటోలు, వీడియోల అప్‌లోడింగ్‌లో విషయంలోనూ అంతరాయం ఏర్పడింది.
మెసెంజర్ ద్వారా వినియోగదారులు ఎవరికైనా సందేశాలు పంపించడానికి ప్రయత్నించినప్పుడు 'సైట్ సమస్య కారణంగా మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయడమైనది. ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో లేవు. కొన్ని నిమిషాల తర్వాత తిరిగి ప్రయత్నించండి' అంటూ సందేశాలు దర్శనమిస్తున్నాయని వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
భారత్ సహా కెనడా, బ్రిటన్, తుర్కియే వంటి దేశాల్లోనూ ఈ సమస్య ఎదురైనట్లు డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ సాంకేతిక సేవల్లో అంతరాయంపై మెటా ఇంకా అధికారికంగా స్పందించలేదు. గతంలో కూడా ఇదే తరహాలో ఈ సేవలకు అంతరాయం ఏర్పడిన విషయం తెల్సిందే.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
Read More