Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హమ్మయ్య.. మైక్రోసాఫ్ట్ సేవలు పునఃప్రారంభం

Advertiesment
microsoft
మైక్రోసాఫ్ట్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సేవలు ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం నుంచి నిలిచిపోయిన విషయం తెల్సిందే. ఈ నిలిచిపోయిన సేవలు ఎట్టకేలకు 36 గంటల తర్వాత తిరిగి రికవరీ అయ్యాయి. ఔట్‌లుక్, టీమ్స్‌తో సహా అన్ని సేవలను పునరుద్ధరించినట్లు మైక్రోసాఫ్ట్ టెక్‌ సంస్థ వెల్లడించింది. 
 
సాంకేతికంగా ఎదురైన సమస్యను పూర్తిగా పరిష్కరించామని, ఇకపై వినియోగదారులు ఈ-మెయిల్స్‌, ఇతర సేవలను యాక్సెస్ చేసుకోవచ్చని తెలిపింది. ఔట్‌లుక్, టీమ్స్, మైక్రోసాఫ్ట్ 365, కోపైలట్‌లను ఉపయోగించే కస్టమర్లపై ఇకపై ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. ఈ అంతరాయం వల్ల 70కి పైగా దేశాలు ప్రభావితం అయిన నేపథ్యంలో కంపెనీ క్షమాపణలు చెప్పింది. సమస్యకు గల కారణాలపై వివరణాత్మక నివేదికను అందిస్తామని వెల్లడించింది.
 
మైక్రోసాఫ్ట్ సేవల్లో గురువారం రాత్రి నుంచి అంతరాయం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనివల్ల వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ మౌలిక సదుపాయాలపై ఆధారపడిన థర్డ్-పార్టీ సేవలు కూడా ప్రభావితమయ్యాయి. ఓపెన్‌ ఏఐ ఆంథ్రోపిక్‌ ఏఐ సేవల్లోనూ అంతరాయం నెలకొంది. ఈ సమస్యతో.. భారత్‌లో ఇండిగో, ఎయిరిండియా, ఆకాశా ఎయిర్‌ వంటి విమానయాన సంస్థల ఈ-మెయిల్‌ ఆధారిత కస్టమర్‌ సేవలకు ఆటంకం ఏర్పడింది. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో మరో తుఫాను - పేరు అక్వాన్ - ఏపీకి మరో ముప్పు