Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నాప్‌డీల్ బంపర్ ఆఫర్: 70 శాతం వరకు తగ్గింపు ప్రకటన

ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం స్నాప్‌డీల్ రెండు రోజుల పాటు ప్రత్యేక అమ్మకాలను చేపట్టింది. వెల్‌కమ్ 2017 పేరుతో జనవరి 8, 9 తేదీల్లో దుస్తులు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై దాదాపు

Advertiesment
Snapdeal Welcomes 2017 With a Two-Day Sale
, శనివారం, 7 జనవరి 2017 (15:45 IST)
ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం స్నాప్‌డీల్  రెండు రోజుల పాటు ప్రత్యేక అమ్మకాలను చేపట్టింది. వెల్‌కమ్ 2017 పేరుతో జనవరి 8, 9 తేదీల్లో దుస్తులు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై దాదాపు 70 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. 
 
ముఖ్యంగా మొబైల్ ఫోన్ల విభాగంలో రెడ్‌మి నోట్ 2 రూ.11,99, శామ్‌సంగ్ జె2 ప ప్రొ (16జీబీ) రూ.9,490, ఐఫోన్‌ 5ఎస్‌(16జీబీ) రూ.17,499, ఐఫోన్‌7 (32జీబీ) రూ.52,999, ఐఫోన్‌ 6ఎస్‌(32జీబీ) రూ.43,999 విక్రయించనున్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. 
 
అంతేకాకుండా వినియోగదారులు ఎస్‌బీఐ కార్డుపై 15శాతం వరకు అదనపు రాయితీని సైతం పొందడంతో పాటు అన్ని ప్రముఖ క్రెడిట్‌ కార్డులపై వడ్డీ రహిత ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తోంది. వివిధ ఉత్పత్తులపై నిర్దేశించిన షరతులు వర్తిస్తాయని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ మంత్రంటే అమ్మాయిలకి చచ్చేంత ఇష్టం.....!