Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ లావాదేవీలు.. ఎలాగంటే..?

Advertiesment
UPI
UPI
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ లావాదేవీలు చేసుకునే సదుపాయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. సాధారణ మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్ ఉంటే చాలు, ఎక్కడి నుండైనా క్షణాల్లో నగదు బదిలీ చేయవచ్చు. 
 
ఈ పద్ధతి చాలా సురక్షితమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సదుపాయం పొందడానికి మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాతో అనుసంధానం అయి వుంటే సరిపోతుంది. 
 
అంతేగాకుండా బ్యాంక్ ఖాతాలో యూపీఏ సేవలు అప్పటికే యాక్టివేట్ చేసి ఉండటం చాలా ముఖ్యం. అలాగే ఫోన్‌లో కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు సజావుగా పనిచేయాలి. స్మార్ట్‌ఫోన్ లేకపోయినా సరే సాధారణ కీప్యాడ్ ఫోన్‌లతో కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా వుంటుంది. 
 
ఎలా పంపాలంటే?
మొబైల్ డయలర్ ఓపెన్ చేసి *99# అని టైప్ చేసి కాల్ చేయాలి. 
స్క్రీన్ మీద మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి.
అందులో మనీ పంపడానికి మొదటి ఆప్షన్ ఎంచుకోవాలి. 
 
ఎవరికి డబ్బు పంపాలో వారి నంబర్ లేదా యూపీఏ ఐడి ఎంటర్ చేయాలి. 
ఆ తర్వాత మీరు పంపాలనుకుంటున్న అమౌంట్ ఎంటర్ చేసి మీ UPI పిన్ నంబర్ ఇవ్వాలి. 
వెంటనే మీ ఖాతా నుండి నగదు బదిలీ అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దారుణ హత్య.. కారణం ఎవరంటే?