Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ. 1499 నుండి ప్రారంభమయ్యే మూడు అధునాతన ఓపెన్-ఇయర్ వైర్‌లెస్ టిడబ్ల్యుఎస్ ఇయర్‌పాడ్‌లతో అర్బన్

Advertiesment
vibe clip

ఐవీఆర్

, బుధవారం, 19 జూన్ 2024 (23:19 IST)
స్వదేశీ సాంకేతికత బ్రాండ్ అర్బన్ తమ వైబ్ సిరీస్ లైనప్‌లో మూడు కొత్త అత్యాధునిక వైర్‌లెస్ ఓపెన్-ఇయర్ టిడబ్ల్యుఎస్ ఇయర్‌పాడ్‌-అర్బన్ వైబ్ క్లిప్, అర్బన్ వైబ్ లూప్ & అర్బన్ వైబ్ 2లను ఆవిష్కరించింది. అర్బన్ వైబ్ సిరీస్ చెవికి అనుకూలంగా ఉండేలా రూపొందించబడింది. సుదీర్ఘమైన వినియోగం వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది; వీటిని రన్నింగ్, జిమ్, హైకింగ్, సైక్లింగ్ లేదా వీధుల్లో నడవడం వంటి సమయంలో సులభంగా ఉపయోగించవచ్చు.
 
అర్బన్ సహ-వ్యవస్థాపకుడు ఆశిష్ కుంభట్ మాట్లాడుతూ, "అర్బన్ యొక్క లక్ష్యం ఎల్లప్పుడూ ప్రాక్టికాలిటీతో ఆవిష్కరణలను మిళితం చేయడం, తమ వినియోగదారులకు గొప్ప సాంకేతిక అనుభవాలను అందించడం. విభిన్న అవసరాలకు అనుగుణంగా, మీరు సంగీతంలో మునిగిపోయినా లేదా పొడిగించిన సంభాషణలను ఆస్వాదించినా, అర్బన్ అందరికీ వ్యక్తిగతీకరించిన, సౌకర్యవంతమైన ఆడియో అనుభవాన్ని నిర్ధారిస్తుంది" అని అన్నారు. 
 
వైబ్ క్లిప్ వినియోగదారులకు సౌలభ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని నిశితంగా రూపొందించబడింది. సూపర్ HD 3D పనోరమిక్ సరౌండ్ సౌండ్ మరియు స్మార్ట్ AI సౌండ్ యాంప్లిఫైయర్‌‌తో పూర్తి ఓపెన్-ఇయర్ టిడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్‌గా వస్తుంది. ధర రూ. 7,999 కాగా, బ్రాండ్ యొక్క వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ పోర్టల్‌లు, రిటైల్ అవుట్‌లెట్‌లలో ప్రత్యేకంగా రూ. 1,999 ప్రారంభ ఆఫర్ ధరతో లభిస్తుంది.
 
అర్బన్ వైబ్ 2 హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ & స్మార్ట్ అడాప్ట్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఒకే ఛార్జ్‌లో 16 గంటల వరకు నాన్-స్టాప్ ప్లేయింగ్ టైమ్‌ను అందిస్తుంది. రూ. 6,999/- ధరతో లభించే ఈ వైబ్ 2 బ్రాండ్ యొక్క వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ పోర్టల్‌లు, రిటైల్ అవుట్‌లెట్‌లలో ప్రత్యేకంగా రూ.1,499/- ప్రారంభ ఆఫర్ ధరతో లభిస్తుంది.
 
అర్బన్ వైబ్ లూప్ అనుకూలమైన అడ్జస్టబుల్ స్లైడింగ్ ఇయర్-లూప్‌లతో వస్తుంది. రూ. 8,999/- ధరతో వచ్చినప్పటికీ, ఇది బ్రాండ్ యొక్క వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ పోర్టల్‌లు, రిటైల్ అవుట్‌లెట్‌లలో ప్రత్యేకంగా రూ. 2,199/- ప్రారంభ ఆఫర్ ధరతో లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊహలకు రెక్కలు తొడగటానికి దేశవ్యాప్తంగా కాన్వాస్‌ను తీసుకువస్తున్న మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్