Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Advertiesment
How eating more junk food can impact your child's mental health

సెల్వి

, మంగళవారం, 14 మే 2024 (20:25 IST)
పంచదార, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉన్న జంక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా చిన్నపిల్లల్లో ఎలాంటి ఇబ్బందులకు దారితీస్తాయో తెలుసుకుందాం. జంక్ ఫుడ్ చిన్న పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. జంక్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ ఈ రోజుల్లో పిల్లల ఆహారపు అలవాట్లలో ఒక సాధారణ భాగంగా మారింది. ఇందులో పిల్లల పెరుగుదలకు ముఖ్యమైన పోషకాలు లేవు. ఇవి బరువు పెరగడంతో పాటు ఊబకాయానికి కారణమవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకంగా నిలుస్తాయి. 
 
ఫాస్ట్ ఫుడ్, చక్కెర పానీయాలు పిల్లల్లో మానసిక సమస్యలకు దారితీస్తుందని అధ్యయనాలు రుజువు చేశాయి. వీటిలో హైపర్యాక్టివిటీ, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ (ఏడీడీ), డిప్రెషన్ కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. 
 
జంక్ ఫుడ్ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల పోషకాహార లోపాలు, అసమతుల్యతలకు దారి తీస్తుందని వైశాలిలోని మ్యాక్స్ హాస్పిటల్ మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ అమితాబ్ సాహా తెలిపారు. 
 
"ఫాస్ట్ ఫుడ్, కెఫిన్ కలిగిన కార్బోనేటేడ్ శీతల పానీయాలలో చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో షుగర్ పెరుగుదలను క్షణక్షణానికి పెంచుతుంది. తర్వాత షుగర్ లెవల్స్‌ను వేగంగా పెరుగుతాయి. ఇది పిల్లలలో చిరాకు, మానసిక కల్లోలంకి దారి తీస్తుంది.
 
అందుకే పిల్లలను ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా వుంచాలని, పిల్లలకు పూర్తిగా సమతుల్య భోజనాన్ని అందించాలని వైద్యులు చెప్తున్నారు. ఇందులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఆరుబయట ఆటలు ఆడటం, తోటపని వంటి శారీరక శ్రమ చేయాలని పిల్లలకు సూచించాలని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి