Publish Date: Sat, 18 Mar 2023 (11:44 IST)
Updated Date: Sat, 18 Mar 2023 (11:55 IST)
పిన్న వయస్కుడవు
చదువుకుంటున్న వాడిలా వున్నావు
తెలియక వచ్చావు భ్రమలో పడి
నేనేమీ అందగత్తెను కాను నీ వనుకుంటున్నట్లుగా
ఇది పైన పటారం లోన లొటారం
కావివి అమృతములూరే అధరాలు
కావివి కాంతివంతమైన కనులు
విటుల చేతి మర్దనతో పటుత్వం తప్పినవీ పాలిండ్లు
ప్రతి మగాడి చూపుడు వ్రేలి తాకిడికి కందినదీ నాభి
కోల్పోయినది స్పర్శ నీవు స్వర్గమనుకుంటున్న ఈ మర్మస్థానం
దరికి రాబోకు
ఇది మలిన దేహం
వయస్సు మళ్ళిన దేహం
పాడు చెసుకోకు ఇందులోపడి నీ జీవితాన్ని
పెంచుకో బాగా చదివి నీ జ్ఞానాన్ని
అందుకో ఎన్నో ఉన్నత పదవులను
చూడగలుగుతావు ఎందరో సుందరాంగులను
ఎంచుకో అందులో నీకు నచ్చిన దానిని
చేసుకో నీ జీవితాన్ని సుఖమయం
చేయకు ఇకపై ఇటు వచ్చే ప్రయత్నం
రచయిత ... గుడిమెట్ల చెన్నయ్య, చెన్నై.