Article Love Poems %e0%b0%b6%e0%b1%83%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%b0 %e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4 107100300028_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శృంగార కవిత

Advertiesment
జోహారులు చేకొనవే చెలి నీ అందానికి
జోహారులు చేకొనవే! చెలి ! నీ అందానికి !
సుమకోమలి! అధరమూరు హిత మకరందానికి !!
తీయని కోరికలెదలో కలిగించినదానా !
“దీపావళి” చీకటిలో వెలిగించినదానా !!
తీరని కోరికచే, మది, రగిలించినదానా !
ఆరని వేదనను పెంచి, మిగిలించినదానా !!

నవ్వు నవ్వి కవ్విస్తూ, ఆడించేదానా!
నాచే శృంగార కవిత, పాడించేదానా !!
వలపుల తలపుల మత్తున తేలించేదానా !!
కలల సీమలోన నన్ను లాలించేదానా !

కనికరించి, తీరని నా కోరికనిక తీర్చవే !
కలల సుఖాలన్నిటినీ, నిజాలుగా, మార్చవే !!
రగిలే వేదన నార్పి, మదికి హాయి గూర్చవే !
మగసిరి, నినుమెప్పించగ, కౌగిలిలో చేర్చవే !!!

Share this Story:

Follow Webdunia telugu