Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ వేసవిలో సిమ్లా అందాలను చూడాలనుందా...? ఐతే ఇవి తెలుసుకోండి

వేసవి కాలంలో ఎండలు బాగా ఇబ్బంది పెడుతున్నాయా... మరి వేసవి తాపం తగ్గించుకోవడానికి చల్లని ప్రదేశాలకు వెళ్లాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటే సిమ్లాను ఎంచుకోండి. ఆ సమయంలో సిమ్లా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చూడవ

Advertiesment
Shimla
, శుక్రవారం, 11 మే 2018 (21:17 IST)
వేసవి కాలంలో ఎండలు బాగా ఇబ్బంది పెడుతున్నాయా... మరి వేసవి తాపం తగ్గించుకోవడానికి చల్లని ప్రదేశాలకు వెళ్లాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటే  సిమ్లాను ఎంచుకోండి. ఆ సమయంలో సిమ్లా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. మాల్ రోడ్డు అనేది సిమ్లాలో ప్రధాన రోడ్డు. ఇక్కడ అన్ని రకాల వ్యాపార భవనాలుంటాయి. ఇక్కడ కేఫ్‌లు, రెస్టారెంట్‌లు, థియేటర్‌లు, టూరిస్టులతో బిజీగా ఉంటాయి. ఈ స్ట్రీట్‌ను తప్పనిసరిగా చూడాల్సిందే.
 
2. ప్రకృతి ప్రేమికులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశం హిమాయన్ బర్డ్ పార్క్. ఇది వైస్ రెగల్ లాడ్జ్ ఎదురుగా 2 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. సిమ్లా వెళితే సీతారామ్ అండ్ సన్స్ అనే హోటల్‌లోనే భోజనం చేయాలి. లక్కర్ బజార్‌లో ఉన్న ఈ హోటల్ సిమ్లాలో చాలా ఫేమస్. గత ఆరు తరాల నుండి వాళ్లు ఈ హోటల్ వ్యాపారంలో ఉన్నారు.
 
3. స్థానికంగా తయారుచేసే హ్యాండీక్రాప్ట్స్‌ను కొనాలంటే హిమాచల్ ఎంపోరియంను సందర్శించాల్సిందే. ఇక్కడ చేతి ఉత్పత్తులు తక్కువ ధరలో  లభిస్తాయి. 
 
4. ఇండియాలో రెండో అతి పురాతనమైన చర్చ్ క్రిస్ట్ చర్చ్. ఇది సిమ్లాకు ల్యాండ్ మార్క్‌గా నిలిచింది. క్లాక్ టవర్, గ్లాస్ విండోస్, పురాతన గ్రంధాల్లో నుండి సేకరించిన విలువైన సమాచారం ఇక్కడ చూడవచ్చు. రాత్రివేళ ఈ చర్చి అందాలు చూపరులను కనువిందు చేస్తాయి.
 
5. సిమ్లాలో మరో చూడదగ్గ ప్రదేశం వైసిరెగల్ లాడ్జి. ఇది ఒకప్పుడు బ్రిటీష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాకు నివాసంగా ఉండేది. ఇక్కడ అద్బుతమైన ఆర్కిటెక్చర్ ఆకట్టుకుంటుంది. చారిత్రాత్మకమైన సిమ్లా ఒప్పందం ఇందులోనే జరిగింది. ఇందులో అలనాటి ఫొటోలు, పుస్తకాలు, ఇతర చారిత్రక అంశాలకు సంబంధించిన ఆధారాలను చూడవచ్చు.
 
6. డిల్లీ నుండి కల్కాకు రైలులో చేరుకోవచ్చు. కల్కా నుండి సిమ్లాకు టాయ్ ట్రైన్ సౌకర్యం ఉంది. డిల్లీ నుండి కల్కా రైల్వే స్టేషన్‌కు రైలు ప్రయాణం సుమారు నాలుగు గంటలు పడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశిరేఖ గెటప్‌లో కీర్తిసురేష్‌ని చూసి షాకయ్యా.. జెమినీ గణేశన్‌పై సావిత్రిది పిచ్చిప్రేమ