Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలిత మృతదేహం వద్ద సెల్ఫీ.. అంత్యక్రియల వద్ద కరుణాస్ స్మైల్ సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. రాజాజీ హాలులో ఆమె మృతదేహాన్ని ఉంచి ఆపై చెన్నై మెరీనా బీచ్‌లో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. అయితే రాజాజీ హాలు వద్ద అమ్మ భౌతిక కాయాన్ని చూ

Advertiesment
Actor Karunas smiling selfie in Jayalalithaa's Funeral going Viral
, బుధవారం, 7 డిశెంబరు 2016 (14:08 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. రాజాజీ హాలులో ఆమె మృతదేహాన్ని ఉంచి ఆపై చెన్నై మెరీనా బీచ్‌లో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. అయితే రాజాజీ హాలు వద్ద అమ్మ భౌతిక కాయాన్ని చూసేందుకు జనసంద్రం పోటెత్తింది.

అపోలో నుంచి పోయెస్ గార్డెన్ అక్కడ నుంచి రాజాజీ హాలులో జయలలిత మృతదేహాన్ని ఉంచారు. ఇలా అమ్మను చివరిసారిగా చూసేందుకు కార్యకర్తలు, ప్రముఖులు, అధికారులు, ప్రజలు బారులు తీరారు. నివాళులు అర్పించారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అమ్మ మృతదేహం పక్కన నిల్చుని ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకున్నాడు. ఆతడు సెల్ఫీ తీసుకునే ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

Actor Karunas smiling selfie in Jayalalithaa's Funeral going Viral
మరోవైపు మెరీనా బీచ్‌లో అమ్మ అంత్యక్రియలు జరుగుతుండగానే సెల్ఫీలు తీసుకునే పద్ధతి కొనసాగింది. దివంగత జయలలితకు అంత్యక్రియలు జరుగుతుండగా, సినీ నటుడు, ఎమ్మెల్యే అయిన కరుణాస్ నవ్వుకుంటూ ఓ వ్యక్తితో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

కాగా సెప్టెంబర్ 22వ తేదీ అపోలోలో అనారోగ్యం కారణంగా చేరిన జయలలిత డిసెంబర్ 5వ తేదీన అర్థరాత్రి మరణించినట్లు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సినీ నటుడైన కరుణాస్‌కు సీటిచ్చి ఎమ్మెల్యే చేసిన పాపానికి ఇలా నవ్వుకుంటూ ఫోజిస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుణ్యక్షేత్రంలా మారిన జయలలిత సమాధి.. తలనీలాలు సమర్పిస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలు