Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లయిందిగా ఆమెనిక నాకొదిలెయ్ అన్నాడు, కుదరదన్నందుకు ఆ పని చేసాడు

Advertiesment
affair
, సోమవారం, 9 నవంబరు 2020 (22:44 IST)
వారిద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. ఒకరంటే మరొకరంటే ఎంతో ఇష్టం. చదువు కూడా కలిసే చదువుకున్నారు. మధ్యలో విద్యను ఆపేసి ఆటోడ్రైవర్లుగా మారారు. కానీ చెడు అలవాట్లకు బానిసలుగా మారిపోయి ఒకే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ మహిళ కారణంగా ఇద్దరూ గొడవపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అసలేం జరిగిందంటే..
 
పశ్చిమబెంగాల్ లోని అసన్సోల్ ప్రాంతం. శేఖర్, విజయ్‌లు ఇద్దరూ ప్రాణస్నేహితులు. ఇద్దరికీ వివాహాలు కాలేదు. ఆటోడ్రైవర్లుగా పనిచేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ ఎంజాయ్ చేసేవారు. మొదట్లో మద్యానికి అలవాటు పడిన వీరు ఆ తరువాత తమ వీధిలో ఉన్న ఒక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు.
 
ఆ వివాహిత పేరు సోనమ్. ఒకరికి తెలియకుండా మరొకరితో ఈమె అక్రమ సంబంధం నడిపింది. డబ్బులు బాగా గుంజింది. కానీ కొన్నిరోజుల క్రితమే విజయ్‌కు వివాహం జరిగింది. పెళ్ళి అయినా సరే అతను మాత్రం మారలేదు. సోనమ్‌తో అక్రమ సంబంధం కొనసాగించాడు.
 
ఇది కాస్త శేఖర్‌కు తెలిసింది. దీంతో శేఖర్, విజయ్‌ను హెచ్చరించాడు. సోనమ్‌ను మర్చిపోవాలన్నాడు. అందుకు ఒప్పుకోలేదు విజయ్. సరేనని విజయ్‌ను పార్టీకి రమ్మని పిలిచాడు. స్నేహితుడే కదా అని విజయ్ కూడా వెళ్ళాడు. కానీ చివరకు స్నేహితుడే తనను చంపుతాడని ఊహించలేదు విజయ్.
 
మద్యం మత్తులో ఉన్న అతన్ని అతి దారుణంగా చంపేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖర్. విజయ్ భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా ఒక మృతదేహం అనుమానస్పదంగా కనిపించింది. విచారణలో శేఖర్ నిందితుడిగా భావించి అతనితో పాటు సోనమ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరదలకు 664 కోట్ల రూపాయల నష్టం: కలెక్టర్ ఇంతియాజ్