Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ పార్టీకి మేమే అంత్యక్రియలు నిర్వహిస్తాం : బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి

వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో ఉండే బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు నోరు పారేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, ఇదే జరిగితే ఆ పార్టీ అంత్యక్రియ

Advertiesment
BJP MP Subramanian Swamy
, సోమవారం, 27 మార్చి 2017 (13:57 IST)
వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో ఉండే బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు నోరు పారేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, ఇదే జరిగితే ఆ పార్టీ అంత్యక్రియలు తామే నిర్వహించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఇటీవ‌ల జ‌రిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ ఫలితాలపై ఆయన సోమవారం మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ కొండత ఆశలు పెట్టుకుందన్నారు. కానీ, యూపీ ఓటర్లు మాత్రం ఆ పార్టీ ఇకపై కోలుకోలేనివిధంగా తీర్పునిచ్చారన్నారు. ఈ ఫలితలతో కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయిందన్నారు. 
 
అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ ఒక్కరే మంచి నేత అని ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే రాజీవ్ ఒక్కరే హిందువులను జాగృత పరచడానికి ఎంతో పాటుప‌డ్డార‌న్నారు. ఆ నాడు కాంగ్రెస్‌ నాయకులు వ్యతిరేకించినప్పటికీ హిందువుల పౌరాణిక ధారవాహిక రామాయణంను దూరదర్శన్‌లో ప్రసారం చేయడానికి ఆయ‌న అంగీకరించారని సుబ్రమణ్య స్వామి గుర్తు చేశారు. 
 
ఇకపోతే అయోధ్యలో రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు చేసిన సూచన సంతృప్తికరంగా లేనప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఇరు వర్గాల వారు కూర్చొని చర్చించి ఓ మధ్యేమార్గాన్ని కనుగొనాలన్నదే తన అభిప్రాయపమన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రైమ్ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపని జియో వినియోగదారులు