Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శవాల దిబ్బగా మారిన వయనాడ్‌.. అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య!!

Advertiesment
wayanad

వరుణ్

, బుధవారం, 31 జులై 2024 (09:51 IST)
కేరళ రాష్ట్రలోని వయనాడ్ ప్రాంతం ఇపుడు శవాల దిబ్బగా కనిపిస్తుంది. ప్రకృతి ప్రకోకానికి ఈ ప్రాంతం మృత్యుఘోష వినిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మొదటిసారి కొండచరియలు విరిగిపడగా.. 4.10 గంటలకు మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామాలకు గ్రామాలు శిథిలాల కింద సమాధి అయ్యాయి.
 
వీటి కింద చిక్కుకున్న అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల సంఖ్య ఇప్పటికే 123కు చేరింది. శిథిలాలను తొలగించే కొద్ది శవాలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 123కి చేరుకుంది. మరో 128 మంది గాయపడ్డారు. భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. వయనాడ్‌లే కుండపోత వర్షాల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. 
 
మంగళవారం అర్థరాత్రి వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా బయటకు తీయడమే లక్ష్యంగా రెస్క్యూలో పాల్గొంటున్న సిబ్బంది అత్యంత వేగంగా పని చేస్తున్నారని చెప్పారు. కాగా కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది రోదిస్తూ కనిపిస్తున్నారు. ఎటూ చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. 
 
కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. అటు ఇటు తిరుగుతూ తమ వారి కోసం వారు పిలుస్తున్న పిలుపు చూసినవారిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇక ఇళ్లలో చిక్కుకున్న కొందరు తమను కాపాడాలంటూ ఆ ఇళ్లలోంచి ఫోన్లు చేస్తున్నారు. ముండక్కె, చూరల్ల, అట్టామల, నూల్పుజా గ్రామాలలో ఈ తరహా దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుప్పటి ఇచ్చేందుకు నిరాకరించిన ఫ్లైట్ అటెండెంట్ : నిరసనకు దిగిన ప్రయాణికులు.. విమానం రద్దు!!