Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

Advertiesment
eknath shindey

ఠాగూర్

, శనివారం, 30 నవంబరు 2024 (11:58 IST)
మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడటం లేదు. మహా పంచాయతీ హస్తినకు చేరినప్పటికీ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో శివసేన (షిండే) వర్గం అధినేత ఏక్‌నాథ్ షిండే రానున్న 24 గంటల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా, తన భవిష్యత్తు కార్యాచరణపై ఆయన ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. 
 
దీంతో ఆయన మహాయుతి కూటమితో కలిసే ఉంటారా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలాఉండగా.. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీసీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నివిస్ పేరు దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతున్నా.. రేసులో కొత్తగా మురళీధర్‌ మోహోల్‌ పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ పుణె ఎంపీ అయిన మురళీధర్‌ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
 
ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీ మంతనాలు జరిగినప్పటికీ ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్ షాతో ఏక్‌నాథ్‌ షిండే సమావేశమయ్యారు. 'సీఎం ఎవరనే దానిపై భాజపా తీసుకునే నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తా. ముంబైలో కూటమి నేతల మధ్య చర్చ జరిగిన తర్వాత రెండు, మూడు రోజుల్లో దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తాం' అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వెల్లడించారు. 
 
అయితే, ఆ తర్వాత కొన్ని గంటలకే ఆ సమావేశాన్ని రద్దు చేసి సొంతూరుకు వెళ్లిపోయారు. దీంతో సీఎం ఎంపిక, శాఖల కేటాయింపుల విషయంలో కూటమి నిర్ణయంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, ఆయన అనారోగ్య సమస్యలతో ఊరికి వెళ్లినట్లు మరికొందరు నేతలు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు