Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్ద నోట్ల రద్దు.. పెళ్ళిళ్లకు రూ.2.5లక్షలు విత్ డ్రా చేసుకోవచ్చు.. సామాన్య ప్రజలకు మరో షాక్

పెద్ద నోట్ల రద్దుతో పెళ్ళిళ్ళు కుదుర్చుకున్న వారికి కష్టాలు తీరనున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలకు కష్టాలు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో పెళ్ళిళ్లకు ముహూర్తాలు కుదుర్చుకుని డబ్బుల్లేక అవస్

Advertiesment
Exchange Limit Reduce from 4
, గురువారం, 17 నవంబరు 2016 (13:20 IST)
పెద్ద నోట్ల రద్దుతో పెళ్ళిళ్ళు కుదుర్చుకున్న వారికి కష్టాలు తీరనున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలకు కష్టాలు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో పెళ్ళిళ్లకు ముహూర్తాలు కుదుర్చుకుని డబ్బుల్లేక అవస్థలు పడుతున్న జనానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్‌ తీపి కబురు చెప్పారు. అయితే సామాన్య ప్రజల రోజుకు తీసుకునే విత్ డ్రా మొత్తంలో కోత విధించారు. తద్వారా నోట్ల మార్పిడి రూ. 4వేల నుంచి రూ. 2వేలకు తగ్గిస్తున్నట్లు శక్తికాంత ప్రకటించారు. 
 
ఈ నిర్ణయం శుక్రవారం నుంచి అమలులోకి రానుంది. దీంతో ఖాతాదారుడు నోట్ల మార్పిడి ద్వారా కేవలం రెండువేలు మాత్రమే పొందనున్నాడు. అయితే రైతులు, చిన్న వ్యాపారులకు విత్‌డ్రా చేసుకునే డబ్బును పెంచింది. రైతులైతే వారానికి రూ.25 వేలు, చిన్న వ్యాపారులైతే వారానికి రూ.50 వేలు తీసుకోవచ్చని శక్తికాంత్‌దాస్ ప్రకటించారు. గుత్త వ్యాపారులు వారంలో రూ.50వేలు ఉపసంహరించుకోవచ్చునని, దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, వివిధ సంస్థలు, రైతు సాధికార సంఘాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు.
 
ఇక పెళ్ళిళ్ల కోసం రూ.2.5 లక్షలను విత్ డ్రా చేసుకోవచ్చునని శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆధారాలు చూపించి వివాహాలకు బ్యాంకుల నుంచి రూ.2.5 లక్షలు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. పెళ్లి కోసం డబ్బులు తీసుకుంటున్నట్టు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని మీడియాతో వెల్లడించారు. ఏటీఎంలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. కావాల్సిన మొత్తాన్ని బ్యాంకులకు తరలిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రజల కష్టాలు తీరిపోతాయని హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుష్మా స్వరాజ్‌కు దొరకని కిడ్నీ దాత... ఆసుపత్రిలో ఎదురుచూస్తూ....