మహిళా హోం గార్డుపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులకు ఆ మహిళ ఐదువేలు ఇవ్వాలని రమ్మని చెప్పి.. ఆమెను బైకుపై తీసుకెళ్లి జ్యూస్‌లో మద్యం కలిపారు. తర్వాత నలుగురు కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈ ఘటన కర్ణాటక, కొప్పళ జిల్లా యెల్బుర్గా తాలూకా మాద్లూర్ సమీపంలో చోటుచేసుకుంది. కుటుంబాన్ని పోషించడానికి, ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి పరిచయస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి వెళ్లిన హోంగార్డు మహిళపై ఈ అకృత్యం జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది.
ప్రస్తుతం ఆ మహిళ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.