Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

Advertiesment
rahul gandhi

ఠాగూర్

, గురువారం, 21 ఆగస్టు 2025 (16:31 IST)
క్రిమినల్ కేసుల్లో అరెస్టయిన మంత్రులను తక్షణం పదవి నుంచి తొలగించేలా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త బిల్లును తీసుకొచ్చింది. దీన్ని బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో ఆమోదించి, ఆ తర్వాత సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమీక్షకు పంపించింది. ఈ బిల్లు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ బిల్లు దేశాన్ని మధ్యయుగంలోకి నెట్టివేస్తుందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఇస్తుందని ఆయన ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'అరెస్ట్ అయినంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదు. కానీ ఈ బిల్లు ద్వారా ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపులకు పాల్పడే ప్రమాదం ఉంది. ఇది న్యాయవ్యవస్థ స్వేచ్ఛను హరించడమే. అధికారం న్యాయాన్ని శాసించే పరిస్థితులు తలెత్తుతాయి' అని హెచ్చరించారు.
 
అయితే, ఈ విమర్శలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ, అరెస్టయిన వ్యక్తి మంత్రి పదవిలో కొనసాగడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది.
 
రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ గొంతు నొక్కేందుకే కేంద్రం ఇలాంటి చట్టాలు చేస్తోందని ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం పార్లమెంటులో ఈ బిల్లుపై చర్చ జరుగుతుండగా, రాబోయే రోజుల్లో దీని భవితవ్యం తేలనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే, దేశ రాజకీయాల్లో మంత్రుల అధికారాలు, బాధ్యతలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..