Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

Advertiesment
murder

ఠాగూర్

, గురువారం, 4 డిశెంబరు 2025 (11:59 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తనకంటే అందంగా ఉండటంతో అసూయ పడిన ఓ కిరాతక మహిళ ముగ్గురు బాలికలను హత్యచేసింది. ఈ హత్యలపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్న కొడుకును సైతం బలితీసుకుంది. ఈ వరుస హత్యలు హర్యానా రాష్ట్రంలోని పానిపట్, సోనిపట్ జిల్లాల్లో రెండేళ్లుగా జరుగుతున్నాయి. అయితే, ఇటీవల ఓ చిన్నారి మృతితో అసలు నిజం బయటపడింది. ఈ కేసులో 32 యేళ్ల నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సోమవారం నౌల్తా గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఆరేళ్ల విధి అనే బాలిక అదృశ్యమైంది. కాసేపటి తర్వాత ఇంటి మొదటి అంతస్తులోని ఓ గదిలో నీటితో నిండిన ప్లాస్టిక్ టబ్బులో శవమై కనిపించింది. కేవలం అడుగు లోతున్న టబ్బులో చిన్నారి మునిగి చనిపోవడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. కేవలం 36 గంటల్లోనే కేసును ఛేదించి, బాలిక పిన్ని అయిన పూనమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె తన నేరాలన్నింటినీ అంగీకరించింది.
 
అందమైన ఆడపిల్లలను చూస్తే తనకు ద్వేషం, అసూయ కలిగేవని నిందితురాలు పోలీసులకు చెప్పింది. వారు పెరిగి పెద్దయ్యాక తనకంటే అందంగా ఉంటారనే అక్కసుతో హత్యలు చేసినట్లు ఒప్పుకుంది. 2023లో సోనిపట్‌లోని తన అత్తగారి ఇంట్లో తొమ్మిదేళ్ల ఆడపడుచు కూతురిని నీళ్ల ట్యాంకులో ముంచి చంపేసింది.
 
ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు తనపై అనుమానం రాకుండా ఉండేందుకు, ఆ తర్వాత మూడు నెలలకే తన మూడేళ్ల కుమారుడు శుభంను కూడా ఇదే పద్ధతిలో హత్య చేసింది. ఈ యేడాది ఆగస్టులో పానిపట్‌లోని తన పుట్టింట్లో బంధువుల అమ్మాయిని కూడా ఇలాగే చంపేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనకాపల్లిలో 480 ఎకరాల భూమిలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌