Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షీనా బోరా కేసులో పీటర్ ముఖర్జియాకు సంబంధం లేదట.. చెప్తున్నది ఎవరంటే రాహుల్?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో తన తండ్రి పీటర్ ముఖర్జియాను అన్యాయంగా ఇరికించారని ఆయన తనయుడు రాహుల్ అంటున్నాడు. ఇన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా అజ్ఞాతంలో ఉన్న రాహుల్ ఒక్కసారిగా బయట

Advertiesment
Sheena Bora Case
, బుధవారం, 21 డిశెంబరు 2016 (12:27 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో తన తండ్రి పీటర్ ముఖర్జియాను అన్యాయంగా ఇరికించారని ఆయన తనయుడు రాహుల్ అంటున్నాడు. ఇన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా అజ్ఞాతంలో ఉన్న రాహుల్ ఒక్కసారిగా బయటికి వచ్చి.. పీటర్ ముఖర్జియాకు వత్తాసు పలకడం సంచలనం సృష్టిస్తోంది. జరిగిన సంఘటనకు, తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని రాహుల్ ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు.
 
తన తండ్రిపై కేసు ఉపసంహరించుకోవాలని రాహుల్ డిమాండ్ చేశాడు. కాగా, రాహుల్‌, షీనా ప్రేమించుకున్నారని, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని, అది ఇష్టం లేక 2012 ఏప్రిల్‌‌లో షీనాను ఆమె తల్లి ఇంద్రాణి దారుణంగా హత్య చేసిందని వార్తలొచ్చాయి. 
 
ఈ కేసులో రాహుల్‌ తండ్రి పీటర్‌ ముఖర్జియా, ఇంద్రాణి, ఆమె డ్రైవరు, ఇంద్రాణి మొదటి భర్త ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో షీనా బోరాకు రాహుల్‌కు ఉన్న సంబంధంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన రాహుల్.. తన తండ్రికి ఈ కేసుకు సంబంధం లేదంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శేఖర్ రెడ్డికి రామ్మోహన్ రావుకు లింకు? ఐటీ దాడులు.. అన్నాడీఎంకే నేతల్లో హడల్..