Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రిటీషన్‌ను పెళ్లి చేసుకున్న మణిపూర్ ఉక్కు మహిళ

మణిపూర్ ఉక్క మహిళగా పేరుగడించిన ఇరోమ్ షర్మిల ఎట్టకేలకు ఓ ఇంటికి కోడలైంది. ఈమె డెస్మాండ్ కుటినోల అనే ఓ బ్రిటీషర్‌ను వివాహం చేసుకుంది. వీరి వివాహం కొడైకెనాల్‌లో జరిగింది. గురువారం ఉదయం 10:30కి మ్యారేజ్

Advertiesment
Irom Sharmila
, గురువారం, 17 ఆగస్టు 2017 (16:21 IST)
మణిపూర్ ఉక్క మహిళగా పేరుగడించిన ఇరోమ్ షర్మిల ఎట్టకేలకు ఓ ఇంటికి కోడలైంది. ఈమె డెస్మాండ్ కుటినోల అనే ఓ బ్రిటీషర్‌ను వివాహం చేసుకుంది. వీరి వివాహం కొడైకెనాల్‌లో జరిగింది. గురువారం ఉదయం 10:30కి మ్యారేజ్ కార్యక్రమానికి దంపతులతోపాటు పెళ్లిని చిత్రీకరించే కెమెరామన్ మినహా ఎవరూ హాజరుకాలేదు.
 
దీనిపై ఆమె స్పందిస్తూ అనారోగ్యం కారణంగా తన అమ్మ ఈ వేడుకకు హాజరుకాలేక పోయారని చెప్పింది. కానీ అమ్మ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నామని, మిగతా బంధువులకు ఎలాంటి ఆహ్వానాలు ఇవ్వలేదని చెప్పింది. అయితే, త్వరలో కొడైకెనాల్‌లోని చర్చిలో బంధువులను పిలిచి వేడుక జరుపుతామన్నారు. 
 
మతాంతర్ వివాహం కావడంతో ప్రత్యేక వివాహ చట్టంలో పేరు నమోదు చేసుకోవడం, అనుమతి రావడం కోసం షర్మిల - డెస్మంట్ రెండు నెలలు ఎదురుచూశారు. చివరికి కొడైకెనాల్ సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్ వివాహానికి ఆమోదం తెలపడంతో ఇరువురు ఒక్కటయ్యారు.
 
మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందిన ఇరోమ్ షర్మిల, అక్కడ ప్రత్యేక సైనికాధికారాల చట్టానికి వ్యతిరేకంగా దశాబ్దమున్నర పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసింది. చట్టసభల్లో పోరాడుతానని ప్రకటించి ఆమె, గతేడాది దీక్షను విరమించడం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఘోరంగా ఓటమిపాలైన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థూ... ఈ బాలయ్య - లోకేష్‌ల వల్ల పరువుపోతోంది.. టీడీపీ నేతలు (Video)