Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీకి ధీటుగా సుష్మా.. అందుకే ఆమెపై విమర్శలు.. జైపాల్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధీటుగా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎదుగుతున్నారనీ, అందుకే సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు చేయిస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్ రెడ్డి ఆరోపించారు

Advertiesment
jaipal reddy
, మంగళవారం, 26 జూన్ 2018 (16:39 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధీటుగా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎదుగుతున్నారనీ, అందుకే సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు చేయిస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ విష ప్రచారం కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేయిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. 
 
హిందూ-ముస్లిం దంపతుల పాస్‌పోర్టు జారీ విషయంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌పై సొంత పార్టీకి చెందిన నేతలే మాటల దాడికి దిగిన విషయం తెల్సిందే. దీనిపై స్పందించిన జైపాల్ రెడ్డి.. సొంత పార్టీ నేతలను సైతం టార్గెట్‌ చేయడం శోచనీయమన్నారు. మోడీ సామాజిక మాధ్యమ సైన్యం హిట్లర్‌ సేనను తలపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
మోడీకి ప్రత్యామ్నాయంగా ఉన్నారనే కారణంతోనే సుష్మా స్వరాజ్‌పై సోషల్‌ మీడియాలో దాడులు చేయిస్తున్నారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల నియంత్రణలో కేంద్రం చేతులెత్తేసిందని జైపాల్‌ రెడ్డి విమర్శించారు. దేశ ఆర్థిక విధానానికి బీజేపీ ముప్పు తెస్తోందన్నారు.
 
ఇదేసమయంలో సీఎం కేసీఆర్‌పైనా జైపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని, రేపు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కేసీఆర్‌ ఏర్పాటుచేస్తానన్న ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏమైంది? అని ప్రశ్నించారు. అన్నివర్గాల ఓట్లు కొట్టేసేందుకు కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ పవన్... కడప పౌరుషాన్ని రెచ్చగొట్టద్దు : సీఎం రమేష్