Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భావనను వేధించినవారు పశువుల కన్నా హీనులు: మోహన్‌లాల్ తీవ్ర ఆగ్రహం

మలయాళీ యువనటి, ప్రముఖ హీరోయిన్ భావనపై లైంగిగ దాడి చేసిన వారు పశువుల కన్నా హీనులని, సత్వర విచారణతో వారికి అత్యంత కఠిన శిక్ష విధించాలని మలయాళ చిత్రపరిశ్రమ సూపర్ స్టార్ మోహన్ లాల్ డిమాండ్ చేశారు. జంతువుల కంటే హీనమైన ఈ క్రూర నేరస్థులను కఠిన శిక్షకు పాత్ర

Advertiesment
Mohanlal
హైదరాబాద్ , ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (22:27 IST)
మలయాళీ యువనటి, ప్రముఖ హీరోయిన్ భావనపై లైంగిగ దాడి చేసిన వారు పశువుల కన్నా హీనులని, సత్వర విచారణతో వారికి అత్యంత కఠిన శిక్ష విధించాలని మలయాళ చిత్రపరిశ్రమ సూపర్ స్టార్ మోహన్ లాల్ డిమాండ్ చేశారు. జంతువుల కంటే హీనమైన ఈ క్రూర నేరస్థులను కఠిన శిక్షకు పాత్రులను చేయడం ద్వారానే అలాంటి క్షుద్రులకు, హీన మనస్కులకు గుణపాఠం చెప్పినట్లవుతుందని మోహన్‌లాల్ పేర్కొన్నారు.
 
మనిషికి సంబంధించిన అన్ని లక్షణాలనూ పోగొట్టుకున్న ఇలాంటి దుర్మార్గులు చేసే చర్యలకు వ్యతిరేకంగా మనం కేవలం కొవ్వొత్తులు వెలిగిస్తూ సానుభూతి ప్రకటించేవారుగా ఉండిపోకూడదని మోహన్ లాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి క్రూర కృత్యాలు చేయడం కాదు కదా అలాంటి ఆలోచన కూడా రాకుండా గుణపాఠం నేర్పూతూ భావన వేధింపు కేసులో నిందతులకు కఠిన శిక్ష విధించాలన్నారు. 
 
ఈ భయంకర పరిస్థితుల్లో భావనకోసం తన హృదయం పరితపిస్తోందని మోహన్ లాల్ పేర్కొన్నారు. ఆమెకు ఎలాంటి ఆలస్యం లేకుండా సత్వర న్యాయం లభించాలని కోరకుంటున్నట్లు చెప్పారు. రెండు రోజుల క్రితం కేరళ లోని కోచి ప్రాంతంలో కారులో వెళుతున్న సినీ హీరోయిన్ భావనను దుండుగులు వెంటాడి కారును గుద్ది అదే కారులో ప్రవేశించి ఆమెపై లైంగిక దాడి చేసి రెండు గంటలపాటు వేధించిన ఘటన సినీ లోకాన్ని, సగటు ప్రజలను ఆగ్రహంలో ముంచెత్తిన విషయం తెలిసిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు అసెంబ్లీ సంఘటనలు ప్రజాస్వామ్యానికే అవమానం : వెంకయ్య