Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోనాలిసా మిస్సింగ్, రాజస్థాన్ అజ్మేర్‌కి వచ్చాక మిస్ అయ్యిందంటూ భర్త పోస్ట్

Advertiesment
Monalisa Bhonsle missing
కుంభమేళా బ్యూటీ మోనాలిసా కేసులో మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. ఆమెను పెళ్లాడిని ఫర్మాన్ ఖాన్ ఓ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ... తన భార్య మోనాలిసా మిస్ అయ్యిందనీ, రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మేర్ పర్యటనకు వెళ్లినప్పటి నుంచి ఆమె ఆచూకి కనిపించకుండా పోయిందంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. కాగా మోనాలిసా 16 ఏళ్ల మైనర్ బాలిక అనీ, ఈ క్రమంలో ఫర్మాన్ పైన పోక్సో కేసు నమోదైంది. ఇప్పుడు మోనాలిసా కనిపించడం లేదంటూ ఫర్మాన్ వీడియో విడుదల చేయడంతో కేసు మరో మలుపు తిరిగింది.
 
మైనర్ బాలిక మోనాలిసాను వివాహం చేసుకున్నందుకు ఫర్మాన్ పై కేసు
మోనాలిసా వివాహంలో ట్విస్ట్ చోటుచేసుకున్నది. ఆమెను వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్ పైన మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు పెట్టారు. మోనాలిసా వయసు కేవలం 16 సంవత్సరాలే కావడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మార్చి 11న కేరళం లోని తిరువనంతపురంలోని అరుమనూర్ దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి కేరళం విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టితో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.
 
ఐతే పెళ్లయ్యాక మోనాలిసా వయసు గురించి తీవ్ర చర్చ జరిగింది. దీనితో ఆమె వయసుపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో... మోనాలిసా డిసెంబర్ 30, 2009లో జన్మించినట్లు వున్నది. పెళ్లి చేసుకునే నాటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఈ విషయం తెలిసి కూడా మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ ఇద్దరూ నకిలీ పత్రాలు సృష్టించి పెళ్లిని రిజిస్టర్ చేయించినట్లు తేలింది. కాగా దంపతులిద్దరూ తమకు సమర్పించిన ఆధార్ కార్డులు ఆధారం చేసుకుని వివాహం జరిపించామని ఆలయ పెద్దలు వెల్లడించారు. ఐతే ఫేక్ పత్రాలు సమర్పించి వివాహం చేసుకున్నందుకు మోనాలిసా భర్తపై పోక్సో కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు... భారత్‌కు వచ్చిన చమురు ట్యాంకర్లు