Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధ్యప్రదేశ్‌ బీటీఆర్‌లో 48 గంటల్లో 8 ఏనుగులు మృతి ఎలా?

Advertiesment
Elephant

సెల్వి

, గురువారం, 31 అక్టోబరు 2024 (12:50 IST)
Elephant
మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లా పరిధిలోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ (బిటిఆర్)లో గత 48 గంటల్లో ఎనిమిది అడవి ఏనుగులు అనుమానాస్పద విషప్రయోగం కారణంగా మరణించాయని అధికారులు తెలిపారు. మరో ఏనుగు తీవ్ర అస్వస్థతకు గురై పశువైద్యులచే చికిత్స పొందుతున్నట్లు సీనియర్ అటవీ అధికారి తెలిపారు. బీటీఆర్‌లో ఎనిమిది ఏనుగులు చనిపోయాయి (గత 48 గంటల్లో).. మరో ఏనుగు చికిత్స పొందుతోంది. మరణానికి గల కారణాలను పోస్టుమార్టం నివేదికల్లో తేలుస్తాం" అని అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏపీసీసీఎఫ్) (వన్యప్రాణి) ఎల్ కృష్ణమూర్తి మీడియాకు తెలిపారు. 
 
ఇకపోతే.. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ఈ సంఘటనపై విచారణ కోసం అటవీ అధికారుల బృందాన్ని బీటీఆర్‌కు పంపింది. అంతేకాకుండా, ఈ సంఘటనపై విడిగా దర్యాప్తు ప్రారంభించడానికి రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) బుధవారం సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు వర్గాలు తెలిపాయి. 
 
ఎనిమిది మంది వెటర్నరీ డాక్టర్ల బృందం చనిపోయిన ఏనుగులకు పోస్టుమార్టం నిర్వహిస్తోంది. మృతదేహాన్ని ఖననం చేసేందుకు 300 బస్తాల ఉప్పును ఆర్డర్ చేశాం. ఇందుకోసం గుంతలు తవ్వేందుకు రెండు జేసీబీ యంత్రాలను వినియోగించనున్నట్టు బీటీఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పీకే వర్మ బుధవారం విలేకరులకు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు.. జల్‌జీవన్‌ మిషన్‌ వేగవంతం.. పవన్