Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలకు శ్రీరామరక్ష.. అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష... మధ్యప్రదేశ్ ప్రభుత్వం యోచన

మహిళల రక్షణకు పెద్దపీట వేసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని యోచిస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టా

Advertiesment
MP government
, ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (11:46 IST)
మహిళల రక్షణకు పెద్దపీట వేసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని యోచిస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. 
 
బాలికల వసతి గృహాల వద్ద పోలీసుల నిఘా పెంచుతామని, వారి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. రోమియోల భరతం పట్టేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి ప్రత్యేక యాంటీ రోమియో స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి ఆకతాయిల భరతం పడుతుండగా పలు రాష్ట్రాలు కూడా యూపీని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లా టీడీపీలో అసంతృప్తి సెగ.. బొజ్జలకు బాబు ఫోన్.. నో రెస్పాన్స్