Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబైలో నిర్భయ ఘటన... కదులుతున్న కారులో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అచ్చం ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలోనే ఈ గ్యాంగ్ రేప్ జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే....

Advertiesment
Mumbai: Three men gang rape girl in a moving car near Charkop
, శుక్రవారం, 7 జులై 2017 (09:08 IST)
దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అచ్చం ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలోనే ఈ గ్యాంగ్ రేప్ జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
ముంబై చార్‌కోప్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల కాలేజీ విద్యార్థిని రోడ్డుపై నడిచి వెళుతుండగా, ముగ్గురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ఆతర్వాత ముంబై రోడ్లపై కారును తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో కాలేజీకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 
 
దీనిపై బాధిత యువతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేసిన వారు తనకు తెలిసిన వారేనని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం చేసిన అనంతరం తనను చార్‌కోప్ ప్రాంతంలో వదిలి వెళ్లారని బాధితురాలు పోలీసులకు చెప్పారు. బాధిత యువతి ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పడకసుఖం కోసం వెళ్లాడు... వేశ్యను ప్రేమించిన లారీ డ్రైవర్.. ఎక్కడ?