Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ సంగమ్ విహార్‌లో తివాచీలో మృతదేహం.. కాళ్లు నరికేసి.. విడివిడిగా పారేశారు..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో ఓ తివాచీ మూటకట్టి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో ఉన్న స

Advertiesment
Mutilated body found dumped in Delhi's Sangam Vihar
, శనివారం, 3 డిశెంబరు 2016 (12:58 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో ఓ తివాచీ మూటకట్టి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజిని తాము పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. తివాచీలో మృతదేహాన్ని గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు మృతదేహాన్ని, దాని భాగాలను విడివిడిగా పారేయడం కనిపించిందని డీసీపీ రోమిల్ బానియా తెలిపారు. 
 
హంతకులు అతడి గొంతు కోసేశారు. అతడి ముఖం మీద ఏదో ఒక బరువైన వస్తువుతో కొట్టారు. ముఖంలో కూడా కొంత భాగాన్ని చెక్కేశారు. మృతదేహాన్ని మూట కట్టడానికి వీలుగానే కాళ్లు నరికేసి ఉంటారని పోలీసులు చెప్పారు. 
 
మృతుడి వయసు సుమారు 35 ఏళ్ల ప్రాంతంలో ఉంటుందని, అతడు తెల్ల షర్టు, లుంగీ ధరించి ఉన్నాడని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి, మృతదేహాన్ని పడేసినట్లు సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది. అయితే నిందితుల ముఖాలు గానీ, ఆటో నంబరు ప్లేటు గానీ స్పష్టంగా కనిపించలేదు. ముందుగానే ఎక్కడో హత్యచేసి, మృతదేహాన్ని సంగమ్ విహార్ వద్ద పారేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోబోలను చంద్రుడిపైకి పంపండి.. రూ.136 కోట్లు గెలుచుకోండి.. పోటీలో ఇండస్...