Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chhattisgarh: నక్సల్స్ ప్రాంతం.. ఐఈడీ పేలి తొమ్మిది మంది రిజర్వ్ గార్డ్స్ మృతి

Advertiesment
Naxals

సెల్వి

, సోమవారం, 6 జనవరి 2025 (22:13 IST)
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం మావోయిస్టులు ప్రేరేపించిన ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (IED) పేలుడులో డ్రైవర్‌తో సహా తొమ్మిది మంది జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది మరణించారు.
 
జిల్లాలోని కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేలి గ్రామ సమీపంలో భద్రతా సిబ్బందితో కూడిన వాహనం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో రహదారి గుండా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 
 
దంతేవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల డీఆర్‌జీ సిబ్బందితో కూడిన ఉమ్మడి బృందాన్ని నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా నక్సల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. పేలుడు కారణంగా కొంతమంది సిబ్బంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన సిబ్బంది ఆస్పత్రికి తరలించడం జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nothing OS 3.0తో వస్తోన్న Nothing Phone 2a Plus.. ఫీచర్లివే..