Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్డౌన్ 4.O : సంకేతాలు పంపిన ప్రధాని మోడీ

Advertiesment
Narendra Modi
కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రం లాక్డౌన్‌ను అమలు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మూడో దశ లాక్డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ లాక్డౌన్‌ను పొడగించాలా? వద్దా? అనే అంశంపై ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వారి అభిప్రాయాలను సేకరించారు. 
 
మరోవైపు, దేశంలో ప్రతి రోజూ దాదాపుగా మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థుల్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ ఎత్తివేయడం సరికాదని పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడగా, వారితో ప్రధాని కూడా ఏకీభవించినట్టు సమాచారం. పైగా, ఆయన లాక్డౌన్ 4.Oకు సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. 
 
అంతేకుండా, దేశంలో రైళ్ళ రాకపోకల పునరుద్ధరణను కూడా పలువురు సీఎంలు వ్యతిరేకించారు. ముఖ్యంగా, తెలంగాణ, బీహార్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే రైళ్ల పునరుద్ధరణకు ససేమిరా అన్నారు. ఇలా అన్ని కోణాల్లో సమాచారాన్ని బేరీజు వేసిన తర్వాత ప్రధాని మోడీ సైతం మే నెలాఖరు వరకు లాక్డౌన్ పొడగింపునకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్డౌన్ ప్రత్యేక రైళ్లలో రాయితీలు... రైల్వే శాఖ కీలక నిర్ణయం