Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంత్రులతో కలిసి సినిమా చూసిన ప్రధానమంత్రి మోడీ!!

Advertiesment
movie watching

ఠాగూర్

, మంగళవారం, 3 డిశెంబరు 2024 (09:15 IST)
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సినిమా చూశారు. తన మంత్రివర్గంలోని మంత్రులతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. ఆ చిత్రం పేరు ది సబర్మతి రిపోర్టు. పార్లమెంట్ ప్రాంగణంలోని థియేటర్‌‍లో వారు ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పందిస్తూ, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
గుజరాత్ రాష్ట్రంలో గత 2002లో జరిగిన గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో 59 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా 'ది సబర్మతి రిపోర్టు' సినిమాను తెరకెక్కించారు.
 
విక్రాంత్ మాస్కే, రాశీఖన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలక పాత్ర పోషించారు. నవంబరు 15వ తేదీన ఈ సినిమా విడుదలైంది. కాగా, పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఇతర మంత్రులు, ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ ఈ చిత్రాన్ని వీక్షించారు. 
 
కాగా, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు ప్రధాని మోడీ స్పందించారు. కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని సినిమా చూసిన తర్వాత ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ ఊపిరి - త్వరలో పనులు ప్రారంభం...