Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూ వివాదం పరిష్కరించమని అడిగితే ప్రైవేట్ గదికి తీసుకెళ్లి మహిళపై అనుచితంగా పోలీసు అధికారి

Advertiesment
woman assault

ఐవీఆర్

, శుక్రవారం, 3 జనవరి 2025 (14:22 IST)
న్యాయం చేయాలంటూ ఆశ్రయించిన మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు పోలీసు అధికారి. కర్నాటక లోని మధుగిరి డివైఎస్పీ రామచంద్రప్పకు కంప్లైంట్ ఇచ్చేందుకు కార్యాలయానికి వచ్చిన ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. కర్నాటక పోలీసు డిపార్ట్‌మెంట్‌ను కుదిపేస్తూ సదరు అధికారి చర్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
 
ఈ ఘటన కర్ణాటక హోంమంత్రి రామేశ్వర్ సొంత జిల్లా తుమకూరులో చోటుచేసుకుంది. భూమి వివాదానికి సంబంధించి ఆ మహిళ పావగడ నుంచి కార్యాలయానికి వచ్చింది. అధికారి ఆమెను ఓ ప్రైవేట్ గదికి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తించాడని, ఆమెతో పాటు వచ్చిన అనిల్ అనే వ్యక్తి రికార్డు చేసిన వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది.
 
వీడియో సర్క్యులేషన్ తరువాత రామచంద్రప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటన పట్ల ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దురదృష్టకరం అని పేర్కొంటూ తుమకూరు ఎస్పీ అశోక్ మాట్లాడుతూ.. ఇది తీవ్రమైన విషయం. సీనియర్‌ అధికారులకు సమాచారం అందించామని, సమగ్ర దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Madhavi Latha: మాధవి లత వేస్ట్ క్యాండిడేట్.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్