Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం : 12 మంది దుర్మరణం

Advertiesment
road accident

ఠాగూర్

, ఆదివారం, 20 అక్టోబరు 2024 (10:45 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. శనివారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. టెంపోను స్లీపర్ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బారీ నగరంలోని కరీం కాలనీ గుమర్ మొహల్లాకు చెందిన నహ్నూ, జహీర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి బరౌలీ గ్రామంలో ఓ కార్యక్రమానికి శనివారం వెళ్లారు. కార్యక్రమం అనంతరం టెంపోలో రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. 
 
సునిపుర్ గ్రామ సమీపంలోని రాగానే వీరు ప్రయాణిస్తున్న టెంపోను ఎదురుగా అతి వేగంగా వస్తున్న స్పీపర్ బస్సు ఢీకొట్టింది. జాతీయ రహదారిపై వెళ్లే ఇతర వాహనాల డ్రైవర్లు వెంటనే ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
 
ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మృతి చెందగా, ఇందులో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నట్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిలో బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా ఉన్నారు.ఒక వైద్యుడు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఓ మహిళ రెండు కత్తెరలతో 12 యేళ్ళుగా అవస్థలు పడుతూ వచ్చింది. ఆపరేషన్‌కు ఉపయోగించే రెండు కత్తెరలు ఉంచి కుట్లు వేసిన 12 ఏళ్ల తర్వాత బయటపడింది. 
 
సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 12 యేళ్ళ క్రితం గ్యాంగ్‌టక్‌లోకి ఓ ఆస్పత్రిలో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంది. అప్పటి నుంచి ఆ మహిళ తరచుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ వచ్చింది. చాలా మంది వైద్యులను సంప్రదించినప్పటికీ నొప్పితగ్గలేదు. నొప్పికి కారణం కూడా చెప్పలేకపోయారు. అయితే, ఈ నెల 8వ తేదీన ఆమెకు తనకు గతంలో ఆపరేషన్‌ చేసిన ఆస్పత్రి వెళ్ళి వైద్యులను సంప్రదించగా, వారు అనుమానంతో ఎక్స్‌రే తీయించగా అసలు విషయం బయటపడింది. 
 
కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అడిషనల్ ఎస్పీ ఏడీఎఫ్ కమల్ కుమార్ జాంగీద్, సబ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దుర్గాప్రసాద్ మీనా, సర్కిల్ ఆఫీసర్ మహేంద్ర కుమార్ మీనా తదితర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడుపులో రెండు కత్తెరలు.. 12 యేళ్ళుగా మహిళ అవస్థలు