Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయ పార్టీలకు ఇచ్చే సలహా ఖరీదు రూ.100 కోట్లు : ప్రశాంత్ కిషోర్

Advertiesment
prashanth kishore

ఠాగూర్

, ఆదివారం, 3 నవంబరు 2024 (12:35 IST)
తనను ఆశ్రయించే రాజకీయ పార్టీలకు తాను సలహాలు, సూచనలు ఇవ్వాలంటే రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. బీహార్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు తాను ఇచ్చే సలహాలకు వసూలు చేసే ఫీజుపై స్పందించారు. రాజకీయ పార్టీ నిర్వహణకు తనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడుగుతున్నారని, తాను ఏదైనా పార్టీకి వ్యూహకర్తగా సేవలందిస్తే అందుకు ఫీజుగా రూ.100 కోట్లు, అంత కుమించి తీసుకుంటానని చెప్పారు.
 
వివిధ రాష్ట్రాలలో పది ప్రభుత్వాలు తన వ్యూహాలతో నడుస్తున్నాయని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. తాను ఒక ఎన్నికలకు వ్యూహకర్తగా పనిచేస్తే వచ్చే సొమ్ముతో రెండేళ్లు రాజకీయ పార్టీని నిర్వహించగలనని అన్నారు. ఒక పార్టీ నుంచి వంద కోట్లు, ఆపైన తీసుకునే తాను ఆర్థికంగా బలహీనంగా ఉన్నట్లా? అంటూ ప్రశాంత్ కిషోర్ ఎదురు ప్రశ్నించారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఆ ఎన్నికలలో నరేంద్ర మోడీ విజయం సాధించడంతో తిరుగులేకుండా పోయింది. 
 
ఆ తర్వాత 2015 ఎన్నికలలో బీహార్లో జేడీయూ - ఆర్జేడీ కూటమికి ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికలలో ఓటమి తప్పలేదు. అయితే, ఆ తర్వాత 2021లో పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అందించడంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనిచేసాయి. 2018లో ఏపీలో వైసీపీకి సలహాదారుగా వచ్చిన ప్రశాంత్.. ఆ ఎన్నికలలో జగన్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2020లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయానికి, 2021లో పశ్చిమబెంగాల్లో జరిగిన ఎన్నికలలో బీజేపీని ధీటుగా ఎదుర్కోవడంలో టీఎంసీకి ప్రశాంత్ కిషోర్ కీలకంగా పనిచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్పత్రి బెడ్‌పై భర్త మృతి - గర్భిణి భార్యతో బెడ్ కడిగించిన వైద్యులు (Video)