Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ సీజేఐను బంగళా ఖాళీ చేయించాలి.. కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు

Advertiesment
dychandrachud

ఠాగూర్

, సోమవారం, 7 జులై 2025 (09:17 IST)
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ వార్తల కెక్కారు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఢిల్లీలో తాను నివసిస్తున్న బంగళాను ఖాళీ చేయలేదు. ఇదే ఆయనకు సమస్య తెచ్చిపెట్టింద. ఢిల్లీలోని ఆయన తన అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు పాలనా విభాగం కోరింది. 
 
2024 నవంబరు 10వ తేదీన సీజేఐగా పదవీ విరమణ పొందిన జస్టిస్ చంద్రచూడ్ గత 8 నెలలుగా టైప్ అధికారిక బంగ్లాలోనే ఉంటున్నారని తెలుపుతూ కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. రిటైర్ అయ్యాక టైప్-1 ప్రభుత్వ బంగ్లాలో ఆరు నెలల పాటు అద్దె చెల్లించకుండానే ఉండొచ్చని, ఆ గ్రేస్ పీరియడ్ కూడా ఇప్పటికే గడిచి పోయిందని ఆ లేఖలో గుర్తు చేసింది. 
 
ప్రస్తుతం సీజేఐగా ఉన్న వారికి టైప్ అధికారిక బంగ్లాను కేటాయించాల్సి ఉన్నందున, దాన్ని వెంటనే ఖాళీ చేయించాలని కోరింది. అధికారిక బంగ్లాలో నివసించేందుకు మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌కు ఇచ్చిన గడువు మే 31తోనే ముగిసిందని గుర్తు చేసింది. 
 
కాగా.. జస్టీన్ చంద్రచూడ్ తర్వాత జస్టిన్ ఖన్నా నియమితులయ్యారు. అయితే, ఆయన 6 నెలలు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. అలా ఉన్నప్పుడు.. 2024 డిసెంబరు 18న జస్టిస్ ఖన్నాకు జస్టిస్ చంద్రచూడ్ ఒక లేఖ రాశారు. ఇప్పటికే తనకు తుగ్లక్ రోడ్డులోని బంగ్లా నంబర్ 14ను కేటాయించారని, అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయని పనులు పూర్తయిన వెంటనే సీజేఐ అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తానని లేఖలో స్పష్టం చేశారు. 
 
ఆ లేఖకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సానుకూలంగా స్పందించారు. జస్టిస్ ఖన్నా సీజేఐ అధికారిక నివాసంలో ఉండకుండానే పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ బీఆర్ గవాయికి సైతం జస్టిస్ చంద్ర చూడ్ ఇదే విజ్ఞప్తి చేశారు. జస్టిస్ చంద్రచూడ్‌కు మే 31 వరకు అనుమతి లభించింది. 
 
అయితే, గడువు పొడిగించ కూడదనే షరతుపైనే అనుమతి ఇచ్చారు. ఆ సమయం కూడా గడిచిపోయి మరో నెల పూర్తయింది. కానీ, జస్టిస్ చంద్రచూడ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. దీంతో సుప్రీంకోర్టు పాలనా విభాగం జోక్యం చేసుకుని కేంద్రానికి లేఖ రాసింది 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12ఏళ్లు డ్యూటీ చేయని కానిస్టేబుల్.. జీతం మాత్రం రూ.28లక్షలు తీసుకున్నాడు..