జమ్మూ: దక్షిణ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలోని కెల్లర్లోని షుక్రు అటవీ ప్రాంతంలో మంగళవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారనే నిర్దిష్ట సమాచారం మేరకు కెల్లర్ అడవుల్లో భారీ కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఒక ఉన్నత పోలీసు అధికారి తెలిపారు.
పోలీసులు, సైనిక బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన వెంటనే, అడవుల్లో దాగి ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతమయ్యారు, అయితే ఉగ్రవాదుల గుర్తింపును నిర్ధారించడం జరుగుతోంది.