Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిక్‌టాక్ పైత్యం.. గన్‌తో కాల్చేసుకున్న ఆర్మీ జవాన్ కొడుకు!

Advertiesment
Tik Tak
, బుధవారం, 15 జనవరి 2020 (09:29 IST)
టిక్‌టాక్ మాయలో పడి ఓ యువకుడు తనకు తానే తుపాకీతో కాల్చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
టిక్‌టాక్‌ పిచ్చిలో పడి ఓ జవాన్ కొడుకు తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని హఫీజ్‌గంజ్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. లైసెన్స్ తుపాకీతో టిక్‌టాక్‌ చేద్దామనుకున్న బరేలీకి చెందిన కేశవ్‌ కుమార్‌ (18) ప్రమాదవశాత్తూ తనను తాను కాల్చుకుని చనిపోయాడు.

పోలీసులు మృతుడి తల్లి తెలిపిన ప్రకారం.. 12వ తరగతి చదువుతున్న కేశవ్‌కుమార్‌ సోమవారం సాయంత్రం కళాశాల నుంచి రాగానే తల్లి సావిత్రీ దేవిని లైసెన్స్ తుపాకీ ఇవ్వాలని కోరాడు. ఎందుకని ప్రశ్నించగా టిక్‌టాక్‌ చేసుకుంటానని చెప్పాడు. ఆమె వంట చేస్తూ.. తుపాకీ ఇవ్వనని వారించింది.
 
అయితే కేశవ్‌ మారాం చేస్తుండటంతో ఇక తప్పక తుపాకీ ఇచ్చి ఆమె మళ్లీ పనిలోపడింది. అయితే కొద్ది క్షణాల్లోనే తుపాకీ పేలిన శబ్దం వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన ఆమె వెంటనే కొడుకు పడక గదిలోకి వెళ్లి చూడగా.. కేశవ్‌ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

వెంటనే చుట్టుపక్కల వారి సాయంతో కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే కేశవ్ చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో సావిత్రి దేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. కేశవ్‌ బెడ్‌రూమ్‌లో భుజంపై తుపాకీ పెట్టుకున్న జవాన్‌ ఫొటో ఉందని, దాని మాదిరిగా టిక్‌టాక్‌ చేద్దామనుకునే కేశవ్‌ చనిపోయి ఉండొచ్చని ఆమె చెప్తున్నారు. తాను కొడుకుకు తుపాకీ ఇచ్చే ముందు గన్ లోడ్‌ చేసి ఉందో, లేదో గమనించలేదని సావిత్రి పోలీసులకు తెలిపారు.
 
కేశవ్‌ గతంలో కూడా తుపాకీతో పలు టిక్‌టాక్‌ వీడియోలు తీసుకునే వాడని ఆమె తెలిపారు. వీటిని తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసుకునేవాడని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.

తుపాకీ సావిత్రి పేరు మీదనే రిజిస్టరై ఉందని వెల్లడించారు. కాగా, కేశవ్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం గమనార్హం. కేశవ్‌ తండ్రి వీరేంద్ర కుమార్‌‌ ఆర్మీ అధికారిగా ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో పనిచేస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆప్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేజ్రీవాల్‌