Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా రూటే సెపరేట్ అంటున్న కేంద్రమంత్రి ... గోడపై పాటపాడేశారు....

రాధామోహన్ సింగ్. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేత, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి. ఈయన కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే నా రూటే సెపరేట్ అంటున్నారు. వ్యవసాయ శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత

Advertiesment
Union Minister Radha Mohan Singh Mocks Modi's Swachh Bharat Drive
, గురువారం, 29 జూన్ 2017 (12:47 IST)
రాధామోహన్ సింగ్. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేత, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి. ఈయన కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే నా రూటే సెపరేట్ అంటున్నారు. వ్యవసాయ శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుల ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇపుడు బహిరంగంగా పాట(మూత్రవిసర్జన)పాడి వార్తలకెక్కారు. 
 
నిజానికి స్వచ్ఛ భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ను ఒక ఉద్యమంలా చేపట్టి, విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. చేస్తున్నారు కూడా. స్వయంగా చీపురు పట్టి వీధులు కూడా చిమ్ముతున్నారు. దీంతో బీజేపీ నేతలంతా అంద‌రూ త‌మదైనశైలిలో స్వ‌చ్ఛ్ భార‌త్ నినాదంతో ముందుకెళ్తున్నారు. 
 
బ‌హిరంగ మ‌లమూత్ర విస‌ర్జ‌న చేయ‌కూడ‌ద‌ని.. మరుగుదొడ్లు లేని వాళ్ల‌కు ప్ర‌భుత్వం డ‌బ్బులు చెల్లించి మ‌రీ వాటిని క‌ట్టిస్తోంది. ఇలా విస్తృతంగా స్వ‌చ్ఛ్ భార‌త్ ఉద్య‌మం దేశ ప్ర‌జ‌ల్లో నాటుకుపోతున్న స‌మ‌యంలో ఓ కేంద్ర మంత్రి మాత్రం స్వ‌చ్ఛ్ భార‌త్ ఉద్య‌మాన్ని తుంగ‌లో తొక్కారు.
Union Minister Radha Mohan Singh Mocks Modi's Swachh Bharat Drive
 
ఉద్య‌మ ప్ర‌తిష్ట‌త‌ను కాల‌రాశారు. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి రాధా మోహ‌న్ సింగ్ బ‌హిరంగంగా ఓ గోడ ద‌గ్గ‌ర మూత్ర విస‌ర్జ‌న చేసిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆయ‌న ఎక్క‌డ ఈ ప‌ని చేశారు.. ఎప్పుడు చేశారు అనే విష‌యాలు మాత్రం తెలియ‌రాలేదు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైవ్‌లో ఉండగా రిపోర్టర్‌కు ఫిట్స్ వచ్చింది.. ఎలా చనిపోయిందో చూడండి (వీడియో)