Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ కోసం సరిహద్దులు దాటాడు.. చిక్కుల్లో పడిన ప్రియుడు!!

Advertiesment
indopak border

ఠాగూర్

, బుధవారం, 1 జనవరి 2025 (10:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రేమ కోసం సరిహద్దులను దాటిన ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డారు. ఈయన సాధారణ వ్యక్తి కాదు. బాధ్యతాయుతమైన పోలీసు వృత్తిలో ఉన్నాడు. అయితే, ప్రియురాలి కోసం అవన్నీ మరిచిపోయిన 30 యేళ్ళ పోలీస్ కానిస్టేబుల్ ఇపుడు చిక్కుల్లో పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్‌లోని ఆలీగఢ్‌కు చెందిన 30 ఏళ్ల యువకుడు బాదల్ బాబుకు పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ప్రియురాలిని కలుసుకునేందుకు బాదల్ బాబు ఇండియా - పాక్ సరిహద్దును దాటి ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. దీంతో అక్కడి పోలీసులు మండి బహుద్దీన్ పట్టణంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
 
అక్కడి చట్టాల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల కస్టడీ విధించింది. దీంతో అతన్ని జైలుకు తరలించారు. ఈ ఘటన డిసెంబరు 27వ తేదీన జరిగితే ఆలస్యంగా వెలుగు చూసింది. బాదల్ బాబు అక్రమ ప్రవేశంపై పాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాదల్ బాబు పాక్ రావడానికి కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా? లేక దీని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
 
అయితే బాదల్ బాబు పాక్ వెళ్లేందుకు ప్రయత్నించడం ఇది తొలిసారి కాదు. గతంలో రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. మూడో సారి విజయవంతంగా ప్రియురాలి వద్దకు చేరుకున్నప్పటికీ పోలీసుల కంటపడి జైలుపాలయ్యాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త యేడాది కానుక - తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు