Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. ఎందుకో తెలుసా? (Video)

Advertiesment
train passenger

ఠాగూర్

, శుక్రవారం, 10 జనవరి 2025 (13:43 IST)
రైలు ప్రయాణికుడుని రైల్వే అటెండర్ల సాయంతో టీటీఈ చితకబాదాడు. రైలు ప్రయాణంలో మద్యం సేవించి మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకుగాను టీటీఈ ఈ చర్యకు పాల్పడ్డాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే, రైలు ప్రయాణికుడుపై దాడికి చేసిన రైల్వే అటెండెంట్లు ప్రయాణికుడుతో కలిసి మద్యం సేవించి, చివరకు ప్రయాణికుడుని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన అమృతసర్ కతిహార్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రైలులో మద్యం సేవించి తోటి మహిళా ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి.. ప్రయాణికుల ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన టీటీఈని కూడా చెంపదెబ్బ కొట్టాడు. దీంతో రెచ్చిపోయిన టీటీఈ, కోచ్ అటెండెంట్ తో కలిసి సదరు ప్రయాణికుడిని చితకబాదాడు. కిందపడేసి, శరీరంపైకెక్కి హింసించాడు. కోచ్ అటెండెంట్ బెల్ట్ తో కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, దగ్గర లంచం తీసుకున్నాడని, మద్యం తాగాడని ప్రయాణికులు ఆరోపించారు. అమృత్‌సర్ కతిహార్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుందీ ఘటన.
 
పంజాబ్ రాష్ట్రానికి చెందిన షేక్ తాజుద్దీన్ బుధవారం అమృత్‌సర్ కతిహార్ ఎక్స్‌ప్రెస్‌లో బీహార్‌లోని సివన్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరాడు. రైల్వే కోచ్ అటెండెంట్లు విక్రమ్ చౌహాన్, సోను మహతోలకు లంచం ఇచ్చి తన సీటులోనే మద్యం సేవించాడు. తాజుద్దీన్‌తో కలిసి చౌహాన్, మహతో కూడా మద్యం సేవించారు. ఆ తర్వాత తోటి మహిళా ప్రయాణికులతో తాజుద్దీన్ అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో చౌహాన్ రైల్వే టీటీఈ రాజేశ్ కుమార్‌ను పిలిచాడు.
 
ఈ సందర్భంగా రాజేశ్ కుమార్‌తో వాగ్వాదానికి దిగిన తాజుద్దీన్.. కోపంతో చెంపదెబ్బ కొట్టాడు. దీంతో రెచ్చిపోయిన రాజేశ్ కుమార్.. తాజుద్దీన్‌ను డోర్ వద్దకు లాక్కుని వెళ్లి చౌహాన్ సాయంతో దాడి చేశాడు. తాజుద్దీన్‌ను కిందపడేసి వీపుపై కూర్చోగా.. చౌహాన్ బెల్ట్‌తో చితకబాదాడు. తాజుద్దీన్ వీపుపై రాజేశ్ కుమార్ ఎగిరి దూకడం వీడియోలో కనిపించింది. ప్రయాణికులు సమాచారం అందించడంతో తర్వాతి స్టేషన్‌లో రైల్వే పోలీసులు టీటీఈని అదుపులోకి తీసుకున్నారు. చౌహాన్, మహతోలు పరారయ్యారు. రైలు మొత్తం వెతికినా దొరకలేదు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో విద్యా సంస్కరణలు... ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల!