Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రన్నింగ్ గరీభ్ రథ్ రైలులో ప్రత్యక్షమైన పాము.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు! (Video)

Advertiesment
snake in train

ఠాగూర్

, సోమవారం, 23 సెప్టెంబరు 2024 (11:22 IST)
సాధారణంగా వర్షా కాలంలో జనావాస ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. వీటిని ప్రజలు ఆయా ఘటనలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వేగంగా వెళుతున్న రైలులో ఓ పాము ఉన్నట్టుండి ప్రత్యక్షమైంది. దీన్ని చూసిన ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటన గరభ్ రథ్ రైలులో చోటుచేసుకుంది. ఏకంగా ఓ పాము రైలులోకి వచ్చి ప్రయాణికులను కంగారు పెట్టించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
సాధారణ రైళ్లోకి కాదు.. ఏకంగా గరీభ్‌ రైలులోకి ప్రవేశించి అందర్నీ భయపెట్టింది. జబల్పూర్ నుంచి ముంబైకి వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. రైలు కాసర రైల్వే స్టేషన్ సమీపిస్తున్న వేళ ఏసీ కోచ్ సీ3లో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమైంది. బెర్త్ హ్యాండిల్‌కు చుట్టుకొని హంగామా చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అరుపులు, కేకలు పెట్టారు. భయంతో అందరూ కలిసి పక్క కోచ్‌‍లోకి వెళ్లిపోయారు. కొందరు ఆ పామును వీడియోలు తీశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఆ కోచ్‌లోకి ప్రవేశించి పామును బయటకు పంపేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు అబద్ధాల కోరు.. ప్రధాని సార్ జోక్యం చేసుకోండి.. జగన్