Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

Advertiesment
Ganesh Mahaprasadam

ఐవీఆర్

, శనివారం, 6 సెప్టెంబరు 2025 (23:07 IST)
అమెరికాలో తెలుగు వారిని కలుపుకుని అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలడెల్ఫియాలో గణేశ్ ఉత్సవాల్లో మహా ప్రసాదాన్ని పంపిణీ చేసింది. ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం అక్షయపాత్ర బృందం సుమారు 1,450 మంది భక్తులకు మహాప్రసాద భోజనం వడ్డించింది. భారతీయ టెంపుల్‌కు $4,250 విరాళం అందించింది. ఈ మహా ప్రసాద పంపిణీ కార్యక్రమం తెలుగువారి ఐక్యతకు, ఆధ్యాత్మిక నిబద్ధతకు నిదర్శనంలా నిలిచింది.
 
ఈ మహా ప్రసాదాన్ని వండటంలో, పంపిణీ చేయడంలో తమ వంతు కృషి చేసిన పాక నిపుణులు, వాలంటీర్లందరికి నాట్స్ కృతజ్ఞతలు తెలిపింది. ఇందులో ముఖ్యంగా జ్యోతి, నిరంజన్, కవిత, విద్య, సుజాత, భార్గవి, సుజనా, అరుణ, రవి, అప్పారావు, రమణ, వెంకట్ శాఖమూరి, మహేష్ పోలినా, సురేంద్ర, మహేష్ రామనాథం, అవుల్ రెడ్డి, వెంకట్ పారేపల్లి, బిందు, లావణ్య పెచ్చెట్టి, కమలజ, భావన, శ్రీనివాస్, రఘు, బాబు, కిరణ్, శివ, దీప్తి, సునీత, అనుపమ, అంజు, లక్ష్మి ఇంద్రకంటి, మాలినీ, మాధవి, లక్ష్మి సనికొమ్ము, లావణ్య చెరువు, సత్య గారు, సతీష్, ప్రసాద్, ఆనంద్, నారాయణ, ఆర్‌కే, లవ, మధు, సుదర్శన్, విజయభాస్కర్, శ్రీని, విజయశ్రీ ఆంటీ, కమల, రామ్, అనిషా, స్తుతి, అమృత, హవీష, యుక్త, రాధిక, ఆలయ చెఫ్ వెంకట్ తదితరులు అహర్నిశలు కృషి చేశారు.
 
ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం చేపట్టిన ఈ సత్యార్యాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, నాట్స్ పూర్వ చైర్మన్ శ్రీధర్ అప్పసాని ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగతావుల, నాట్స్ బోర్డు సభ్యులు వెంకట్ శాకమూరి, నాట్స్ జాయింట్ సెక్రటరీ రామ్ కొమ్మనబోయిన నాట్స్ ప్రోగ్రామ్స్ నేషనల్ కో ఆర్డినేటర్ రమణ రకోతు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మురళీకృష్ణ మేడిచెర్ల తదితరులు ఈ కార్యక్రమం విజయంలో కీలక పాత్ర పోషించారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?