Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

Advertiesment
tulasi

సెల్వి

, బుధవారం, 8 మే 2024 (11:32 IST)
అక్షయ తృతీయను వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజున శుభకార్యాలు ప్రారంభించవచ్చు. ఈ పర్వాదినాన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు అందరూ బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 10న వస్తుంది. 
 
ఈ ఏడాది అక్షయ తృతీయకు చాలా ప్రత్యేకత ఉందని నందకిషోర్ తెలిపారు. దాదాపు ఒక శతాబ్దం తర్వాత చంద్రుడు, గురుడు వృషభరాశిలోకి ఒకేసారి ప్రవేశిస్తాయని, ఈ అరుదైన ఖగోళ సంఘటనతో గజకేసరి రాజయోగం ఏర్పడనుందని వివరించారు. 
 
ఇంకా అక్షయ తృతీయ నాడు లక్ష్మీ కుబేర పూజ చేయడం సంపదలను ప్రసాదిస్తుంది. అక్షయ తృతీయ పండుగను మే 10 శుక్రవారం జరుపుకోనుండగా ఈ రోజున తులసి మొక్కను ఇంట నాటడం మంచిది. ఈ రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి. 
 
సాయంత్రం సమయంలో  తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా విష్ణువుకి సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను జోడించండి. ఇలా చేస్తే మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. 
 
అక్షయ తృతీయ రోజున ఆలయానికి వెళ్లి విష్ణువుకు పసుపు పువ్వులతో పాటు కొన్ని తులసి దళాలను  సమర్పించాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. దీని ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...