అవును ప్రస్తుతం చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇందుకోసం గోపూజ తప్పక చేయాల్సిందే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ప్రతీరోజూ లేదా శుక్రవారాల్లో గోవును పూజిస్తే.. వాటికి ఆహారం అందించడం ద్వారా సౌభాగ్యం, మనశ్శాంతి, ఇంకా ఇతరులకు ఇచ్చిన నగదు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ముఖ్యంగా అప్పులు తీరిపోవాలంటే.. ముఖ్యంగా గోపూజ చేయాలి. రోజూ వాటికి ఆహారం అందించాలి. రోజూ ఉదయం లేదా సాయంత్రం గోవును మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి. పశువులకు గ్రాసం అందించడం చేయటం ద్వారా అప్పుల బాధ నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.
రోజూ కుదరకపోయినా శుక్రవారం పూట గోపూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇలా చేస్తే ఆ ఇంట సౌభాగ్యం చేకూరుతుంది. ఆర్థిక వృద్ధి, కుటుంబ సౌఖ్యం వంటి శుభ ఫలితాలు చేకూరుతాయి. సంపన్నులైతే 108 గోవులకు పూజ చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.
గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లవుతుంది. గోపూజ ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. పశువులకు అరటిపండు, అవిసె ఆకులు అందిస్తే మానసిక ఉల్లాసం జరుగుతుంది. మానసిక ఆందోళనలు దూరం అవుతాయి. పశువులకు గ్రాసం, ధాన్యం వంటి ఆహారాన్ని అందిస్తే పుణ్యం చేకూరుతుంది. కర్మ ఫలితాలు తొలగిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అప్పులు తీర్చడం, రావలసిన బకాయిలు చేతికి అందుతాయి.