Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం... ఈ రోజు రాశిఫలితాలు (03-08-2017)

మేషం : ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునర

Advertiesment
daily prediction
, గురువారం, 3 ఆగస్టు 2017 (05:41 IST)
మేషం : ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరాలోచన మంచిది. ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది.
 
వృషభం : సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రావలసిన ధనం వసూలు కోసం బాగా శ్రమిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్ట్ మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. ఇతర దేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి.
 
మిథునం : నూనె, ఎండుమిర్చి, పసుపు, ధనియాలు, బెల్లం, శెనగల వ్యాపారస్థులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. కొన్ని సందర్భాలలో మీ ప్రమేయం లేకుండానే కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండానే కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి.
 
కర్కాటకం: ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు క్రీడలు, క్విజ్ వంటి పోటీలలో రాణిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ముఖ్యులతో సంభాషించేటప్పుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. ఆలయ సందర్శనాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.
 
సింహం: ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రయాణాలు అనుకూలం. రావలసిన ధనం కొంత మొత్తం అందుకుంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. గతంలో నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆశించినంత ప్రతిఫలం లభించదు.
 
కన్య : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునప్పుడు మెళకువ అవసరం. ధనవ్యయం, చెల్లింపులలో మెలకువ వహించండి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఊహించని చికాకులెదుర్కోవలసి వస్తుంది.
 
తుల : పత్రికా సంస్థల్లోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యాన్ని మెప్పించలేరు. ఆర్థిక సమస్యలు తలెత్తినా మిత్రుల సహకారంతో సమసిపోతాయి. ఇతరుల సాయం కోసం ఎదురుచూడకుండా మీ యత్నాలు సాగించండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం : ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని బంధాలను నిలుపుకోవటానికి కష్టపడాల్సి వస్తుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకును కలిగిస్తుంది. ఇతరుల కారణంగా మీరు మాటపడాల్సి ఉంటుంది. సహోద్యోగులతో సమావేశాలలో పాల్గొంటారు. వాహనం నడుపునప్పుడు జాగ్రత్త అవసరం.
 
ధనస్సు : అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మనిగ్రహం వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సజావుగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల్లో వారు అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మనిగ్రహం వహించవలసి ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు ఇరుగు పొరుగువారి నుంచి గుర్తింపు లభిస్తుంది.
 
మకరం : రాజకీయనాయకులకు విదేశీ పర్యటనలు అనుకూలం. మీ ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేయటం వల్ల భంగపాటు తప్పదు. ఐరన్, ఆటోమొబైల్, ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. సోదరుల నుంచి సహాయం అందుతుంది. మీ మాటకు సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది.
 
కుంభం : బ్యాంకు లావాదేవీలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసివస్తుంది. కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భాల్లో ధన నష్టము సంభవించును. విలువైవ వస్తువులు అమర్చుకోవాలనే కోరిక వాయిదా వేసుకోవాల్సివస్తుంది. ప్రమఖులను కలుసుకుంటారు.
 
మీనం : ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెంటాడుతుంది. ఏ పని చేపట్టినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహపరుస్తాయి. స్థిరచరాస్తుల విషయంలో ఏకీభావం కుదరదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భ్రాంతిని తొలగించేదే సాధన... స్వామి వివేకానంద