Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒంటిపై సగం వస్త్రాన్ని ధరించే చోట.. భర్తకు గౌరవం లేనిచోట ఆమె అస్సలుండదట?

అందం, ధైర్యం, సామర్థ్యం గల మహిళలుండే ఇంట శ్రీమహాలక్ష్మీ దేవి నివాసం ఉంటుంది. సోమరితనం లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పనిచేసుకుంటూ వుండే వారింట, కోపం లేని చోట, దైవభక్తి ఉన్నచోట, విశ్వాసపాత్రులైన వారింట లక్ష్మీ

Advertiesment
Goddess Laxmi
, గురువారం, 31 ఆగస్టు 2017 (13:43 IST)
అందం, ధైర్యం, సామర్థ్యం గల మహిళలుండే ఇంట శ్రీమహాలక్ష్మీ దేవి నివాసం ఉంటుంది. సోమరితనం లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పనిచేసుకుంటూ వుండే వారింట, కోపం లేని చోట, దైవభక్తి ఉన్నచోట, విశ్వాసపాత్రులైన వారింట లక్ష్మీదేవి కొలువుంటుంది. అసత్యాలు పలకని వారింట.. జ్ఞానేంద్రియాలను నిగ్రహించుకునే మానవులుండే ప్రాంతంలో సంపదకు ప్రతిరూపమైన, శ్రీమహావిష్ణువు పత్ని వుంటుంది. 
 
భక్తి, వంటింటి పాత్రలు శుభ్రంగా వున్నచోట, పశువులు, ధనధాన్యాలుండే ఇంట లక్ష్మమ్మతల్లి నివాసం చేస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. పెద్దలను గౌరవించే చోట, వారికి మర్యాదిచ్చే మహిళలుండే ప్రాంతంలో లక్ష్మీదేవి వుంటుంది. ఓర్పు, సహనం, శాంతి, బాధ్యత, ధర్మం ఎక్కడుంటుందో ఆమెకూడా అక్కడే వుంటుంది. 
 
ఆహార పదార్థాలను వృధా చేసేవారు, కోపంతో ఊగిపోయేవారింట  మాత్రం లక్ష్మీదేవి వుండదు. దేవతలను పూజించని, పెద్దలను, బ్రాహ్మణులను గౌరవించని చోట కూడా శ్రీమహాలక్ష్మీ కొలువుండదు. భర్తకు వ్యతిరేకంగా వ్యవహరించే మహిళలున్న చోట, భర్త విసిగించి, వేధించే ప్రాంతంలో శ్రీదేవి కొలువుండదట. ఎప్పుడూ చూసిన నిద్రించేవారు, ఏడుస్తూ వుండేవారు, దుఃఖం, నిద్ర వున్న లక్ష్మీదేవి కొలువుండదు. 
 
ముఖ్యంగా గడపపై తలపెట్టి నిద్రించేవారింట, భూమి అదిరేలా నడిచే వారింట శ్రీదేవి నివాసం వుండదు. వాహనాలు, ఆభరణాలు, తామర పువ్వులు, రాజుల ఆసనాలు, అన్నం, నదులలో, పవిత్ర జలాల్లో శ్రీదేవి నివాసముంటుంది. గజరాజు, వృషభం, రాజుల సింహాసనం, సాధువులున్న చోట మహాలక్ష్మి వుంటుంది. అతిథి సర్కారులు, దేవతా పూజలు జరిగే ప్రాంతంలో నీతిపరులైన క్షత్రియుల వద్ద, వ్యవసాయం చేసే వారింట లక్ష్మీదేవి వుంటుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
అంతేగాకుండా శ్రీ మహాలక్ష్మీదేవి 96 స్థానాల్లో వుంటుంది. పసుపు, కుంకుమ, రత్నాలు, బంగారం, ముత్యాలు, చక్కని తెల్లని వస్త్రాల్లో లక్ష్మీదేవి వుంటుంది. నలుపు, ఎరుపు రంగులు మాత్రం మహాలక్ష్మీకి పడవట. రాగి, వెండి కలశాలు, శుభ్రమైన ప్రాంతాలు, ఆవు పేడలో, ఆవు కొమ్ముల్లో మహాలక్ష్మీ వుంటుంది. కల్మషము లేని మనస్సులో లక్ష్మీదేవి వుంటుంది. స్వచ్ఛమైన, ప్రశాంత వుండే చోట, అలంకారాల్లో, ఉత్తమమైన ఆశయాల్లో మహాలక్ష్మీ వుంటుంది. 
 
అయితే ఏ స్త్రీ జుట్టును విరబోసుకుని వుంటుందో ఆ ఇంట మహాలక్ష్మీ దేవి అక్క దరిద్ర దేవత వుంటుంది. సగం వస్త్రాన్ని ధరించే పురుషుల్లో, స్త్రీలలో, ఆచారం లేని చోట మహాలక్ష్మీ దేవి కొలువై వుండదు. గోర్లు, వెంట్రుకలు మాటిమాటికీ పడవేసే చోట.. హింసకు ఉపయోగించే ఆయుధంలో లక్ష్మీదేవి వుండదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : మీ రాశి ఫలితాలు 31-08-17