Publish Date: Thu, 02 Jul 2026 (19:53 IST)
Updated Date: Thu, 02 Jul 2026 (19:56 IST)
కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి 2026లో జూలై 3న వస్తుంది. ఉదయం 11.20 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు 2026 జూలై 4న మధ్యాహ్నం 12.39 గంటలకు ముగుస్తుంది. జ్యేష్ఠమాసంలో కృష్ణ పక్ష చతుర్థి నాడు గణేశుని కృష్ణపింగళ రూపాన్ని పూజిస్తారు. ఈ రోజును కృష్ణ పింగళ సంకష్ట చతుర్థి అని అంటారు. ఈ రోజున ఉపవాసం పాటించే వారికి అన్ని విధాలా విజయం, శ్రేయస్సు కలుగుతాయి.
సంకష్టి చతుర్థి వ్రతం రోజున, వ్రతం చేసేవారు ఉదయం స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తర్వాత, పాప పరిహారి అయిన గణేశుడిని పూజించాలి. పూజ సమయంలో, గణేశుడికి నువ్వులు, బెల్లం, లడ్డూలు, దూర్వా , చందనం సమర్పించి, మోదకాలను నైవేద్యంగా సమర్పించాలి. హారతి ఇచ్చి, చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ పవిత్రమైన రోజు 21 జిల్లేడు ఆకుల పూజ చేసినా సంకటాలు తొలగి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయని అంటున్నారు.
సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి తాము సాయంత్రం తినాలి. ఇలా యధాశక్తి ఆ గణపయ్యను ఆరాధిస్తే మనం అనుకున్న కోరికలన్నీ సిద్ధించి, మన కష్టాలు తీరతాయని ప్రతీతి.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
Read More