Publish Date: Fri, 12 Jun 2026 (18:21 IST)
Updated Date: Fri, 12 Jun 2026 (18:31 IST)
జూన్ 13, 2026 శని త్రయోదశి అధిక జ్యేష్ఠ మాసంలో వస్తోంది. అధిక జ్యేష్టమాసంలో మాసశివరాత్రితో వస్తోన్న ఈ శని త్రయోదశి చాలా శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఈ రోజున శని దోషాల నుంచి ఉపశమనం పొందాలనుకునేవారు.. శని దేవాలయాలను సందర్శించి తైలాభిషేకం వంటివి చేయడం చాలా మంచిది.
అలాగే జూన్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల కాలం పరమాద్భుతమైన కాలం. దీన్ని శనిత్రయోదశి పర్వం అనే పేరుతో పిలుస్తారు. జాతక శని దోషాలు, రాశి శని దోషాలు పోవడంతో పాటు పరమశివుని అనుగ్రహం పొందాలంటే ఆ సమయంలో శివాభిషేకం చేయడం చాలా మంచిది.
ఇంకా నల్ల నువ్వుల నూనెతో శని మందు దీపం వెలిగించి, ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా నల్ల నువ్వులు, వస్త్రాలు, ఇనుప వస్తువులను దానం చేయాలి; కాకులకు ఆహారం అందించడం కూడా శ్రేయస్కరం.
శని దోషాలు సంపూర్ణంగా తొలగిపోయి, శివానుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్యం కలగాలంటే ముప్పై మూడు మారేడు దళాలతో పరమేశ్వరుడిని పూజించడం అత్యంత శుభ ఫలితాలనిస్తుందంటున్నారు. శివుడిని ముప్పై మూడు మారేడు దళాలతోనే ఎందుకు పూజించాలంటే.. అధికమాసంలో 33 సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే, ఈ మాసంలో 33 అరిసెలు, అప్పాలు, బూరెలు వంటివి దానమివ్వమని అంటుంటారు. పూజలు చేసినా 33 పుష్పాలతో పూజలు చేయమని చెబుతుంటారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
Read More