ఆడపిల్లలకు ఇవ్వవలసిన సూచనలు....
ఈ కాలంలో ఆడపిల్లలపై దాడులు ఎక్కువయిపోతున్నాయి. ప్రేమను అంగీకరించకపోయినా, వారి కోరికలు కాదన్నా ఆడపిల్లలను చంపేస్తున్నారు. ఈ కాలంలో వయస్సు తేడా కూడా తెయట్లేదు చాలామందికి. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ
Publish Date: Wed, 01 Aug 2018 (14:52 IST)
Updated Date: Wed, 01 Aug 2018 (17:10 IST)
ఈ కాలంలో ఆడపిల్లలపై దాడులు ఎక్కువయిపోతున్నాయి. ప్రేమను అంగీకరించకపోయినా, వారి కోరికలు కాదన్నా ఆడపిల్లలను చంపేస్తున్నారు. ఈ కాలంలో వయస్సు తేడా కూడా తెయట్లేదు చాలామందికి. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు జాగ్రత్తలు, సూచనలు ఇవ్వాలి.
ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లలకు రోజులో కొంత సమయమైన కేటాయించాలి. అప్పుడే వారి అలవాట్లను, కోరికలను తెలుసుకుంటారు. ఆడపిల్లలతో సంభాషిస్తేనే వారి ఆలోచనలకు తగినట్లుగా సలహాలా ఇస్తారు. స్కూల్ లైఫ్‌లో ఉన్న పిల్లలకు తోటి విద్యార్థులతో ఎలా మెలగాలో చెప్పించాలి. అప్పుడే వాళ్లు అందరితో కలసికట్టుగా ఉంటారు.
కొత్త వ్యక్తులు పరిచయ విషయంలో ఎలా ఉండాలో అనే అవగాహనను తల్లిదండ్రులు చెప్పితేనే వారు దానికి తగినట్లుగా మసలుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకు కరాటేలో కొన్ని మెళుకువలను నేర్పిస్తే మంచిది. కాలేజీ టైమ్‌లో ఎదురైయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో విశ్లేషిస్తూ లక్ష్యసాధనకు ఎటువైపు అడుగులు వేయాలా సూచించాలి.
స్నేహితులతో గొడవలకు దూరంగా ఉండాలని, అందరితో మంచిగా ఉండేందుకు ప్రయత్నించాలని చెబుతుండాలి. ఉద్యోగంలో స్థిరపడితే అక్కడి సహోద్యోగులతో ఎంతమేరకు పరిచయం పెంచుకోవాలో సలహాలివ్వాలి. వారి పట్ల సమస్యలు వస్తే వాటిని ఎలా పరిష్కరించాలో చెప్పించాలి. అంతేకాకుండా ఉద్యోగోన్నతికి తగిన సూచనలు ఇస్తుండాలి.